పరకామణి చోరీ కేసు : ఫిర్యాదు చేసిన ఏవీఎస్వో అనుమానాస్పద మృతి

ఠాగూర్
శుక్రవారం, 14 నవంబరు 2025 (13:33 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణికి సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తితిదే మాజీ ఏవీఎస్వో సతీశ్‌ కుమార్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్‌పై విగతజీవిగా కనిపించారు. పరకామణి కేసులో విదేశీ డాలర్లను దొంగతనం చేసిన రవికుమార్‌పై అప్పట్లో ఏవీఎస్వో సతీశ్ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరచగా అప్పట్లో రాజకీయ నాయకులు, తితిదే ఉన్నతాధికారులు పోలీసుల ఒత్తిడితో ఆ కేసును న్యాయస్థానంలో సతీశ్‌ కుమార్‌ రాజీ చేసుకున్నారు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 
 
ఈ నేపథ్యంలో ఈ కేసుపై సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ బృందం ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న సమయంలో.. కేసు రాజీ చేసుకున్న సతీశ్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. సతీశ్ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా హత్య చేసి రైలు పట్టాలపై పడేశారా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

తర్వాతి కథనం
Show comments