ఇంటి ముందు పెరిగిన గడ్డిని తొలగిస్తున్న యువతిని ఓ పాము కాటేసింది. ఈ ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో ఓ యువతి ఇంటి ముందున్న గడ్డిని తొలగిస్తుండగా.. కత్తిపోటుకు ఓ పాము మూడు ముక్కలైపోయింది.
అయితే కొనఊపిరితో వున్నప్పటికీ ఆ పాము యువతిని కాటేసింది. ఈ ఘటనలో కాటేసిన యువతిని నాటు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లినా యువతి చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయింది. కత్తిరిస్తుండగా గడ్డిలో దాగి ఉన్న పామును ఆమె గమనించలేదు.
గ్రాస్ కట్టర్ కారణంగా పాము మూడు ముక్కలైంది. మురైనా జిల్లా సబల్ గఢ్ సమీపంలోని గ్రామంలో భర్తి కుశ్వాహా అనే ఆ యువతి పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు.