Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిని కాదన్నందుకు తండ్రిని చంపించిన కుమార్తె

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (23:32 IST)
ఒకే ఒక్క కూతురు. గారాంభంగా పెంచుకున్నారు. బయటి వ్యక్తులతో పెళ్ళి చేస్తే ఇబ్బంది పడుతుందని భావించారు. అందుకే బంధువులకే ఇచ్చి పెళ్ళి చేశారు. మూడేళ్ళే. అంతే అల్లుడితో గొడవపడి ఇంటికి వచ్చేసింది కూతురు. సర్దుకుపోతుందిలే.. ఆమే భర్త వద్దకు వెళుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె ఇంటి దగ్గరలో ఒక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అది కూడా తండ్రి ముందే స్కూటర్ పైన అటుఇటూ ప్రియుడితో తిరుగుతూ కనిపించింది. ఇంకేముంది..

 
తమిళనాడు రాష్ట్రం రామనాథపురం సమీపంలోని కవనూరు ప్రాంతంలో నివాసముంటున్నారు రవి, సెల్వి. వీరికి ఒక్కరే కూతురు అనుపమ. వారికి ఆమె అంటే ఎంతో ఇష్టం. ఎంతో గారాభంగా చూసుకున్నారు ఆమె అడిగినవన్నీ కొనిచ్చారు. 

 
ఆస్తి బాగా ఉండటంతో చాలామంది అనుపమను పెళ్ళి చేసుకోవడానికి ముందుకు వచ్చారు. కానీ బయటి వారికి ఇవ్వడం ఇష్టం లేని తండ్రి బంధువుల అబ్బాయికి వివాహం చేశాడు. ఐతే పిల్లలు పుట్టలేదు. మూడేళ్ళలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవ.

 
అత్తింటి నుంచి అనుపమ ఇంటికి వచ్చేసింది. సాధారణ గొడవే కదా... మళ్ళీ కూతురు సర్దుకుని వెళుతుందిలే అనుకున్నాడు తండ్రి, కానీ ఇంటికి సమీపంలో మురుగానంద అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది అనుపమ.
 
అతనితో కలిసి స్కూటర్ పైన తిరగడం చూశాడు తండ్రి. హెచ్చరించాడు. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తండ్రి పైనే స్కెచ్ వేసింది అనుపమ. ప్రియుడి సహకారంతో చంపేయాలని ప్లాన్ చేసింది. అతని స్నేహితుల సహకారంతో తండ్రిని వాహనంతో ఢీకొట్టి చంపేశారు. మొదట్లో రోడ్డు ప్రమాదంగా భావించారు పోలీసులు. కానీ అనుపమ భార్య సెల్వి ఫిర్యాదుతో హత్యగా కేసు నమోదు చేశారు. అనుపమ, మురుగానందను విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments