దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు నిజమైన వారసురాలిని తానేనని అందువల్ల తనకు వారసత్వ ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేయాలని ఓ మహిళ ప్రాధేయపడుతుంది. ఇదే అంశంపై ఆమె మదురై తాహసీల్దారు కార్యాలయాన్ని సంప్రదించింది. ఆమె పేరు జయలలిత మీనాక్షి (38).
జయలలితకు నిజమైన వారసురాలిని తానేనని, తన తల్లి పేరు జయలలిత, తండ్రి పేరు శోభన్ బాబు అని పేర్కొంటుంది. జయలలిత మృతి చెందడంతో తనకు వారసత్వ సర్టిఫికేట్ మంజూరు చేయాలని ఆమె కోరుతుంది. ఈ మేరకు ఆమె గత జనవరి నెల 27వ తేదీన ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంది.
అయితే నెలలు గడిచిపోయినప్పటికీ తనకు సర్టిఫికేట్ మంజూరు చేయకపోవడంతో ఆమె తాహసీల్దారు కార్యాలయాన్ని సంప్రదించి వారసత్వ సర్టిఫికేట్ మంజూరు చేయాలని గొడవకు దిగింది. దీంతో అక్కడ కొద్దిసేవు ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి ఆ మహిళను అక్కడ నుంచి పంపించివేశారు.