Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నిరుద్యోగుల సంఖ్య 6,16,689

Advertiesment
Andhra Pradesh
, గురువారం, 17 మార్చి 2022 (11:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల సంఖ్యా వివరాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం నిరుద్యోగుల సంఖ్య 6,16,689గా ఉంది. ఇందులో మహిళా నిరుద్యోగుల సంఖ్య 1,94,634గా ఉండగా, పురుష నిరుద్యోగుల సంఖ్య 4,22,055గా ఉంది. ఈ వివరాలను రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఏలూరి సాంబశివరావు, బాలవీరాంజనేయులు, అనగాని సత్యప్రసాద్, మంతెన రామరాజులు అడిగి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానమిచ్చింది. ఇందులో అత్యధికంగా విజయనగరం జిల్లాలో 64,294 మంది నిరుద్యోగులు ఉంటే, అత్యల్పంగా 18,730 మంది నిరుద్యోగులు ఉన్నారు. జిల్లాల వారీగా నిరుద్యోగుల సంఖ్యను పరిశీలిస్తే, 
 
విశాఖపట్నం మొత్తం నిరుద్యోగులు 98,504, పురుషులు 68,409, స్త్రీలు 30,095
కర్నూలులో మొత్తం నిరుద్యోగులు 64,294, పురుషులు 50,639, స్త్రీలు 13,655
కడపలో మొత్తం నిరుద్యోగులు 58,837, పురుషులు 40,427, మహిళలు 18,410
పశ్చిమగోదావరిలో మొత్తం నిరుద్యోగులు 55,665, పురుషులు 37,365, స్త్రీలు 18,300
తూర్పుగోదావరిలో మొత్తం నిరుద్యోగులు 48,507, పురుషులు 32,640, స్త్రీలు 15,867
నెల్లూరులో మొత్తం నిరుద్యోగులు 44,761, పురుషులు 30,932, మహిళలు 13,829
చిత్తూరులో మొత్తం నిరుద్యోగులు 43,639, పురుషులు 27,023, స్త్రీలు 16,616
విజయనగరంలో మొత్తం నిరుద్యోగులు 42,296, పురుషులు 28,482, స్త్రీలు 13,813
కృష్ణాలో మొత్తం నిరుద్యోగులు 39,941, పురుషులు 25,882, స్త్రీలు 14,059
ప్రకాశంలో మొత్తం నిరుద్యోగులు 37,457, పురుషులు 27,142, స్త్రీలు 10,315
గుంటూరులో మొత్తం నిరుద్యోగులు 32,484, పురుషులు 20,873, స్త్రీలు 11,611
శ్రీకాకుళంలో మొత్తం నిరుద్యోగులు 31,574, పురుషులు 20,771, స్త్రీలు 10,803
అనంతపురం మొత్తం నిరుద్యోగులు 18,730, పురుషులు 11,469, స్త్రీలు 7,261

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా ఫోర్త్ వేవ్: ఇజ్రాయిల్‌లో మరో డెంజర్ వేరియంట్స్