Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమంత అందాల ఆరబోత: వెంకటేష్ కుమార్తె ఏమన్నదో తెలుసా?

Advertiesment
venkatesh's daughter ashrita comments
, సోమవారం, 14 మార్చి 2022 (09:50 IST)
సమంత అందాల ఆరబోత టాపిక్ ఇప్పుడప్పుడే చల్లారేట్లు లేదు. ఆమె తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఫోటోలపై తలోరకంగా స్పందిస్తున్నారు. ఫ్యాన్స్ అయితే ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. దీనితో సమంత ఒకింత ఆగ్రాహానికి గురైంది.

 
మీరు మారరా?
మహిళలు ధరించే దుస్తులను కించపరచడం, వారు ఏ జాతికి చెందినవారు, ఇంకా వారి చర్మపు రంగు ఏంటి అనే డర్టీ టాపిక్స్ గురించి కొంతమంది మాట్లాడుతూ సులభంగా అంచనా వేస్తారు. ఇలాంటి వాటిపై సమంత ఓ పోస్ట్ పెట్టారు. స్త్రీల హెమ్‌లైన్‌లు, నెక్‌లైన్‌ల ఆధారంగా వారి గురించి వ్యాఖ్యలను పంపే బదులు తమ వ్యక్తిత్వాలను మెరుగు పరుచుకోవడంపై దృష్టి పెడితే మంచిదని పోస్ట్ చేసింది.

 
ఒక స్త్రీగా తీర్పు చెప్పబడడం అంటే ఏమిటో నాకు ప్రత్యక్షంగా తెలుసు. మహిళలు ధరించే దుస్తులు, వారి జాతి, విద్య, సామాజిక స్థితి, రూపాన్ని, చర్మపు రంగును బట్టి అంచనా వేస్తాము. ఇంకా ఈ జాబితా చాలానే వుంటుంది. 2022 లోకి వచ్చాక కూడా అలాంటి ఆలోచనలు మారడంలేదే అంటూ మండిపడింది సమంత.

 
కాగా సమంత లుక్ పైన ఒకవైపు కొందరు ట్రోల్స్ చేస్తుంటే వెంకటేష్ కుమార్తె ఆశ్రిత మాత్రం డిఫరెంటుగా స్పందించింది. క్యూట్... లవ్లీగా వున్నావంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తింది. మరి దీనిపై సమంత ఎలా రియాక్ట్ అవుతుందో?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరల్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'రాధేశ్యామ్' - 2 రోజుల్లో రూ.119 వసూళ్లు!