భర్త అనారోగ్యంతో ఐదేళ్ళ క్రితం చనిపోయాడు. కూతురితో ఆమె కలిసి ఉంటోంది. భర్త ప్రభుత్వ ఉద్యోగి కావడంతో పెన్షన్ వస్తూ ఉండేది. దీంతో ఇంటిని అలా నడుపుకుంటూ వస్తోంది ఆ మహిళ. అయితే కుమార్తె ఒక యువకుడిని ప్రేమించింది. ఏ మాత్రం భయపడకుండా అతనే తన ప్రియుడిని పెళ్ళి చేసుకుంటానంది. అయితే ఆ యువకుడు అందంగా ఉండడంతో కూతురే కాదు తల్లి కూడా కనెక్టయ్యింది. చివరకు..
కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలో నివాసముంటున్నారు పద్మావతి, సునీత. పద్మావతి భర్త అనారోగ్యంతో చనిపోయాడు. రైల్వే ఉద్యోగిగా పద్మావతి భర్త పనిచేయడంతో ఆమెకు పెన్షన్ ఎక్కువగా వస్తూ ఉండేది. దీంతో కుమార్తెను చదివించుకుంటూ ఇంటి పట్టునే ఉండేది పద్మావతి. ఎవరితోను మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటూ వచ్చేది.
అయితే సునీత డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలో కుమార్ అనే సెల్ ఫోన్ షాపు యజమాని ఆమెకు పరిచయమయ్యాడు. మొబైట్ రిపేర్ కోసం షాపుకు వెళ్ళిన సునీతకు అక్కడ కనెక్టయ్యాడు కుమార్. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్ళి వరకు వెళ్ళేలా చేసింది.
సునీత భయపడకుండా కుమార్‌ను తన తల్లికి పరిచయం చేసింది. కుమార్ బాగా అందంగా ఉన్నాడు. బాగా చదువుకున్నాడు. తండ్రి సహాయంతో సెల్ ఫోన్ దుకాణం నడుపుకుంటూ ఉన్నాడు. కుమార్తెతో మాట్లాడేందుకు వచ్చే కుమార్‌తో పద్మావతి మాటలు పెట్టుకునేది. టైంపాస్ చేయడం మొదలెట్టింది. అలా కుమార్‌కు దగ్గరైంది. అతనితో శారీరక సంబంధం పెట్టుకుంది. విషయం బయటకు తెలియకుండా ఉండాలని కుమార్ దగ్గర ఒట్టు కూడా వేయించుకుంది.
విషయం సునీతకు తెలిసింది. లోలోపల మథనపడి పోయింది సునీత. తల్లి, ప్రియుడు కలిసి మోసం చేస్తున్నారని మనస్థాపానికి గురై సుసైడ్ చేసుకుంది. ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది. అంతకుముందే సుసైడ్ లేఖను రాసింది. అయితే ఆ లేఖను కాల్చేసింది పద్మావతి. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అన్ని విషయాలను చెప్పేసింది.