Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామయ్యా, అమ్మ మరొకడితో ఆటోలో ఎక్కి వెళుతోంది: దారి కాచి హత్య చేశారు

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (19:52 IST)
తన సోదరి వేరొకరితో అక్రమ సంబంధం సాగిస్తుందని తెలిసి ఆ వ్యక్తిని హత్య చేసాడు ఆమె సోదరుడు. తన వెంట మరో ముగ్గురుని తీసుకుని వచ్చి అక్రమ సంబంధం నెరపుతున్న వ్యక్తిని చనిపోయేవరకూ కొట్టి చంపాడు. ఆ తర్వాత అతడి శవాన్ని తీసుకుని నేరుగా పోలీసు స్టేషనుకి వెళ్లి లొంగిపోయాడు.

 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. బెంగళూరులోని కోలారు జిల్లా మాలూరుకి చెందిన ఓ మహిళ వస్త్ర పరిశ్రమలో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకి రెండేళ్ల క్రితం తమిళనాడుకి చెందిన భాస్కర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దసరా పండుగ రోజు కూడా ఈ విషయమై భర్త ఆమెను నిలదీశాడు. దాంతో ఆగ్రహంతో ఆమె తన కుమారుడిని తీసుకుని బెంగళూరు వచ్చేసింది.

 
మరుసటి రోజు తన ప్రియుడితో కలిసి ఆటోలో ఎక్కి వెళ్లింది. దీన్ని గమనించిన ఆమె కుమారుడు విషయాన్ని తన మేనమామకి చేరవేశాడు. అంతే... ఆ మహిళ సోదరుడు మునిరాజు తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆటోలో వెళ్తున్న వారిద్దరినీ అటకాయించారు.

 
ఆటో నుంచి తన సోదరిని కిందకు దించి ఇంటికి పంపారు. ఆ తర్వాత ఆమెతో వివాహేతర సంబంధం సాగిస్తున్న భాస్కర్ ను గొడ్డును బాదినట్లు బాదారు. ఆ దెబ్బలకు తాళలేక అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి శవాన్ని తీసుకుని పోలీసు స్టేషనుకి వెళ్లి లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments