మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంచు మోహన్‌బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల సందర్శించారు. మోహన్‌బాబు, మంచు విష్ణు, లక్ష్మీప్రసన్నతోపాటు పేనల్ సభ్యులైన బాబూమోహన్, మాదాలరవి, శ్రీనివాసులు తదితరులు వున్నారు.
ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ, `మా` అధ్యక్షునిగా మా బిడ్డ ఎన్నికకావడం ఆ వేంకటేశ్వరుని, షిరిడి సాయి ఆశీస్సులు దక్కాయి. వారి ఆశీస్సులతోపాటు `మా` సభ్యులందరినీ ఆశీర్వాదం వుంది. ఇది ఎంతో బాధ్యతతో కూడిన పదవి. గౌరవప్రదమైంది. గౌరవానికి ఏ లోటురాకుండా నా బిడ్డ నెరవేరుస్తాడు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
మంచు విష్ణు తెలుపుతూ, ఈ గెలుగు ప్రతి ఒక్క సభ్యుడిది. ఎన్నికల తర్వాత రావాలని మొక్కుకున్నా. అందుకే తిరుమల వచ్చా. ఆయన ఆశీర్వాదం తీసుకున్నాం. ఇంకా మాకు బలం కావాలి. అందరి ఆశీస్సులు కావాలని తెలిపారు.
ఈ సందర్భంగా అక్కడి విలేకరులు పోటీ పేనల్ రాజీనామా చేశారు కదా? అని అడిగితే, మీ మీడియా ద్వారానే నాకు తెలిసింది. నా దగ్గరకు రాజీనామాలు రాలేదు. వచ్చాక చెబుతాను. ఇది దేవుడి సన్నిది కాబట్టి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అంటూ ముగించారు.