Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

పవన్‌ కళ్యాణ్‌ మా ఫ్యామిలీ ఫ్రెండ్‌.. మంచు విష్ణు

Advertiesment
Pawan kalyan
, సోమవారం, 18 అక్టోబరు 2021 (16:39 IST)
మా (మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌)కి ఇటీవల జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్‌ గెలుపొందిన విషయం తెలిసిందే. శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సోమవారం మంచు విష్ణు తన కొత్త కమిటీతో తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో ముచ్చటించారు. 
 
ఇందులో మంచు విష్ణు అనేక విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆదివారం జరిగిన `అలాయ్‌ బలాయ్‌` కార్యక్రమంలో పవన్‌ని, మంచు విష్ణుకి మధ్య ఏర్పడిన గ్యాప్‌పై విష్ణు క్లారిటీ ఇచ్చారు. స్టేజ్‌పైన ఏం జరిగిందో చూశారు. కానీ అంతకు ముందే స్టేజ్‌ కింద తామిద్దరం మాట్లాడుకున్నామని, చాలా విషయాలు డిస్కస్‌ చేసుకున్నామని తెలిపారు విష్ణు. తనపై జోకులు కూడా వేశారని పేర్కొన్నారు. చాలా రోజులుగా పవన్‌ కళ్యాణ్‌ తమ ఫ్యామిలీ ఫ్రెండ్‌ అని వెల్లడించారు. 
 
ఇక చిరంజీవి.. మోహన్‌బాబుకి ఫోన్‌ చేసిన మాట్లాడారనే విషయంపై స్పందిస్తూ, వారిద్దరి మధ్య డిస్కషన్‌ జరిగిందని, ఏం మాట్లాడుకున్నారనేది వాళ్లనే అడగాలని తెలిపారు విష్ణు. ఎన్నికల ఓటింగ్‌ లెక్కింపులో జరిగిన అవకతవకాలపై ఆయనస్పందిస్తూ, ఓట్ల లెక్కింపులో ఎలాంటి తేడా జరగలేదన్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ కావాలంటే ప్రకాష్‌రాజ్‌ హ్యాపీగా చూసుకోవచ్చని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అద్వితీయ మూవీస్ నిర్మిస్తోన్న గ్రే - ప్రారంభం