Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ప్రవర్తనపై అనుమానం... నరికిన తలతో స్టేషన్‌లో లొంగిపోయిన భర్త

Webdunia
ఆదివారం, 10 డిశెంబరు 2023 (09:37 IST)
కట్టుకున్న భార్య అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ భర్త కిరాతక చర్యకు పాల్పడ్డాడు. కట్టుకున్న భార్య తల తెగనరికేశాడు. ఆ తలతో నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణం ఒరిస్సా రాష్ట్రంలోని నయాగఢ్ జిల్లాలో వెలుగు చూసింది. శనివారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని బిజుపాజు గ్రామానికి చెందిన బాఘా - ధరిత్రి (30) అనే దంపతులు ఉన్నారు. అయితే, ధరిత్రి మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని బాఘా అనుమానించాడు. ఇదే విషయంపై వారి మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. ఈ పరిస్థితుల్లో ఆవేశంతో పదునైన ఆయుధంతో తలను నరికేశాడు. ఆ తలను చేతపట్టుకుని నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. 
 
శనివారం ఈ సంఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన బనిగొచ్చా పోలీసులు... తలలేని ధరిత్రి మొండేన్ని కూడా గుర్తించినట్టు చెప్పారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు చెప్పారు. ఈ  హత్యతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments