Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మలక్‌పేట తీగలగూడ వద్ద తల లేని మహిళ మృతదేహం

Advertiesment
deadbody
, బుధవారం, 17 మే 2023 (17:09 IST)
హైదరాబాద్ నగరంలోని మలక్‌పేట తీగలగూడ వద్ద తలలేని మహిళ మొండెం కనిపించింది. దీన్ని చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పైగా, ఇది స్థానికంగా కలకలం రేపుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళను ఎక్కడో, ఎవరో హత్య చేసి పాల్తీన్ కవర్‌లు చుట్టి తలను మూసీ నదిలో తీగలగూడ వద్ద వదిలివేసివుంటారని పోలీసులు అనుమానానిస్తున్నారు. 
 
అయితే, ఆ మహిళ మొండెం ఎక్కడ ఉందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మహిళ ఎవరనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు, మొండెం లేని తల మహిళను హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ మహిళను హత్య చేసిన దుండగుల కోసం దర్యాప్తును ప్రరాంభించారు. సంఘటన స్థలంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు సేకరించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భాగ్యనగరిలో తొలి లిక్కర్ అలెర్జీ కేసు నమోదు