Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యువతులతో నగ్నపూజలు.. పూజారితో సహా 12 మంది అరెస్టు

Advertiesment
Priest Arrested
, సోమవారం, 15 మే 2023 (13:35 IST)
సులభంగా డబ్బులు సంపాదించేందుకు యువతులతో నగ్నపూజలు చేయించిన పూజారి, ఆయనకు సహకరించిన బ్యూటీపార్లర్ యజమానురాలు, మధ్యవర్తులతో కలిసి మొత్తం 12 మందిని గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నగ్నపూజల్లో కూర్చొన్న యువతుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఓ విద్యార్థినితో పాటు ప్రైవేటు కంపెనీలో పని చేసే ఓ యువతి కూడా ఉన్నారు.

వ్యాపారంలో నష్టపోయిన అరవింద తన బాధలు నాగేశ్వర రావుకు చెప్పుకుంది. గుప్త నిధులు కనిపెట్టడం ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చని, అందుకు యువతులతో నగ్నంగా క్షుద్రపూజలు చేయాల్సి ఉంటుందని పూజారి చెప్పాడు. ఈ మాటలు నమ్మిన అరవింద తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా ఇద్దరు అమ్మాయిల కోసం గాలించి ఎంపిక చేశారు. వారికి నగ్న పూజల్లో కూర్చుంటే రూ.లక్ష ఇస్తామని డబ్బు ఆశ చూపించారు. ఈ ఇద్దరిని నాగేంద్ర అనే వ్యక్తి తీసుకుని అరవింద వద్దకు వెళ్లగా ఆమె పూజారి నాగేశ్వర రావుకు అప్పగించారు.

ఆ తర్వాత పూజారి వారిని నగ్నంగా కూర్చోబెట్టి పూజలు నిర్వహించాడు. ఆ తర్వాత యువతులపై పూజారి, అతని అనుచరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వారు ఎదురు తిరగడంతో శనివారం కారులో ఎక్కించుకుని గుంటూరు వైపు బయలుదేరారు. కారు గోరంట్ల సమీపంలోకి రాగనే బాధిత యువతులు తప్పించుకుని దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం చేరవేశారు. వెంటనే అప్రమత్తమైన గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పూజారి, అతడి అనుచరులు సహా మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు అల్పాహారం : మంత్రి సత్యవతి