ఐటీ దాడులలో మద్యం వ్యాపారస్తుల బీరువాల్లో కరెన్సీ నోట్లు చూసి అధికారులు షాకయ్యారు. ఆ బీరువాల్లో వుంచిన డబ్బును లెక్కించేందుకు యంత్రాలు కూడా మొరాయించాయట. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	వివరాల్లోకి వెళితే.. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో వివిధ లిక్కర్ తయారీ సంస్థలకు సంబంధించిన ఆస్తులపై ఐటీ దాడులు నిర్వహించి దాదాపు రూ.200 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
									
										
								
																	
	 
	పన్ను ఎగవేత ఆరోపణలపై ఎంఎస్ శివ గంగా అండ్ కంపెనీ, బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్‌తో సహా ఆరుకుపైగా సంస్థలతో పాటు ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.