Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారిపై అత్యాచారం - కన్నతల్లి సమక్షంలోనే ప్రియుడి పైశాచికత్వం

ఠాగూర్
మంగళవారం, 20 మే 2025 (12:11 IST)
ముంబై మహానగరంలో దారుణం జరిగింది. సభ్యసమాజం తలదించుకునే దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. కన్నతల్లి సమక్షంలోనే చిన్నారిపై అత్యాచారం జరిగింది. ప్రియుడి చేతిలో రెండున్నరేళ్ళ పసిపాప అత్యంత కిరాతకంగా అత్యాచారానికి గురైంది. మల్వాణీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మల్వాణీకి చెందిన 30 యేళ్ల మహిళకు 19 యేళ్ల యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. మహిళకు రెండున్నరేళ్ల బాలిక కూడా ఉంది. ఈ క్రమంలో ఆ మహిళ సమక్షంలోనే ఆ కామాంధుడు రెండున్నరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత గొంతు నులిమి చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
అయితే, చిన్నారికి మూర్ఛ రావడంతో కింద పడిపోయినట్టుగా నమ్మించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆ చిన్నారి అప్పటికే మృతి చెందడంతో వైద్యులు అనుమానించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వేరు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిర్వహించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి వర్గాల ద్వారా ఈ విషయం పోలీసులకు తెలిసింది. ఆ వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
చిన్నారి మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు ఆమెపై లైంగికదాడి జరిగిందని, ఊపిరాడకపోవడం వల్ల కలిగిన షాక్‌తో పాప మరణించిందని ధృవీకరించారు. ఈ ఘటనలో తల్లి, ఆమె ప్రియుడి ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించగా పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. వారిద్దరిపై పోక్సో చట్టం, బీఎన్ఎస్ చట్టాల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం