Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను కూలీగా చూడలేని వివాహిత పోలీసుతో వివాహేతర సంబంధం, చివరికి?

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (17:19 IST)
ఇద్దరు పిల్లలు. ప్రేమగా చూసుకునే భర్త. ఎలాంటి సమస్యలు లేని కుటుంబం. కానీ ఆ భార్యకు భర్త కూలి పనిచేస్తుండడం ఏ మాత్రం ఇష్టం లేదు. తన భర్త హుందాగా ఉద్యోగం చేసే వ్యక్తి అయి ఉండాలని భావించింది. అందుకే వేరే వ్యక్తిని ఎంచుకుంది. కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుని చివరకు ప్రాణాలనే పొగొట్టుకుంది.

 
కర్ణాటక రాష్ట్రం శిడ్లఘట్ట ప్రాంతంలో రాజేశ్వరి, వెంకటేష్‌లు నివాసముంటున్నారు. వీరికి 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. వెంకటేష్ ముందు నుంచి కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థికంగా అయితే ఎలాంటి ఇబ్బందులు లేవు.

 
కానీ రాజేశ్వరికి మాత్రం తన భర్త కూలి పనిచేయడం ఇష్టం లేదు. వ్యాపారం చేయమని ఎన్నోసార్లు ప్రాధేయపడింది. కూలి పని చేసినా మనకు డబ్బులు సరిపోతున్నాయని.. ఆర్థిక ఇబ్బందులు లేవు కదా.. కొత్తగా అప్పు చేసి ఎందుకు వ్యాపారం పెట్టడమని భర్త చెబుతూ వచ్చాడు. 

 
దీంతో భార్యకు కోపమొచ్చింది. ఇంటికి సమీపంలో అనంత్ కుమార్ అనే కానిస్టేబుల్ ఉండేవాడు. అతనికి వివాహం కాలేదు. అనంత్‌కు, రాజేశ్వరికి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. పెళ్ళయి ఇద్దరు పిల్లలున్న వివాహిత ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉండేది.

 
భర్తకు తెలిసింది. మందలించాడు. అయినా మారలేదు. అయితే భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మనస్థాపానికి గురైన రాజేశ్వరి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన భార్య చావుకు అనంత్ కుమార్ కారణమని ఫిర్యాదు చేశాడు భర్త. 

 
దీంతో అనంత్ కుమార్ పరారయ్యాడు. పరారీలో ఉన్న అనంత్‌ను పోలీసులు వెతుకుతున్నారు. పచ్చటి సంసారాన్ని అక్రమ సంబంధంతో రాజేశ్వరి నాశనం చేసుకోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments