Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైతుల ఉద్యమాన్ని ఖలీస్తాన్ ఉద్యమం.. ఉగ్రవాదంతో పోల్చిన కంనగా - కేసు

Advertiesment
రైతుల ఉద్యమాన్ని ఖలీస్తాన్ ఉద్యమం.. ఉగ్రవాదంతో పోల్చిన కంనగా - కేసు
, బుధవారం, 24 నవంబరు 2021 (12:56 IST)
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతులు ఒకయేడాదికి పైగా ఉద్యమం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఈ సాగు చట్టాలను రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. 
 
కానీ, నిత్యం వివాదాల్లో చిక్కుకునే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మాత్రం రైతు ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఉద్యమాన్ని ఖలీస్తాన్ ఉద్యమంతో పోల్చారు. పైగా రైతులను ఉగ్రవాదులతో ఆమె పోల్చారు. 
 
ఈ మేరకు సుబుర్భన్ ఖన్ పోలీస్ స్టేషన్‌లో కంగనా రనౌత్‌పై కేసు నమోదు చేసారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన పలువురు సిక్కు మత పెద్దలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. కాగా, ఇటీవల భారత స్వాతంత్ర్యంపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రష్మీ గౌతమ్‌కు గోల్డెన్ ఛాన్స్.. మెగాస్టార్‌తో స్టెప్పులు