Publish Date: Fri, 12 Nov 2021 (14:40 IST)
Updated Date: Fri, 12 Nov 2021 (14:42 IST)
హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్‌లో మసాజ్ మాటున వ్యభిచార వృత్తిని గుట్టుగా సాగిస్తున్న వ్యవహారాన్ని పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి అనేక మంది యువతులతో పాటు.. మొత్తం పది మందిని అరెస్టు చేశారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మూసాపేట సమీపంలోని భవానీనగర్‌లో ఆర్ట్ స్పా సెంటర్ పేరిట భీమ్‌సింగ్ అనే వ్యక్తి మసాజ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. ఇక్కడు మసాజ్ మాటున పలువురు అమ్మాయిలతో వ్యభిచారం గుట్టుగా సాగుతున్నట్టు స్థానికులకు సమాచారం వచ్చింది.
దీంతో సనత్‌నగర్ పోలీసులు సోమవారం రాత్రి దాడులు జరిపారు. నిర్వాహకుడు భీమ్‌సింగ్‌తో పాటు అతని ఇద్దరు అనుచరులు, ఓ విటుడు, కోల్‌కత్తాకు చెందిన ఆరుగురు యువతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.