Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాగులో చిక్కుకున్న 20 మంది కూలీలను కాపాడిన పెద్దపప్పూరు పోలీసులు

Advertiesment
వాగులో చిక్కుకున్న 20 మంది కూలీలను కాపాడిన పెద్దపప్పూరు పోలీసులు
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 23 నవంబరు 2021 (14:37 IST)
వ‌ర‌ద బీభ‌త్సంలో ఎన్నో ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తుపాను ఎంతో మందిని పొట్ట‌ను ప‌ట్టుకోగా, చాలా మందిని అధికార యంత్రాంగం కాపాడుతోంది. అనంత‌పురం జిల్లాలో వాగు ఉధృతిలో చిక్కుకున్న 20 మంది కూలీలను పెద్దపప్పూరు పోలీసులు కాపాడారు.
 
 
పెద్దపప్పూరు మండల పరిధిలోని జోడి ధర్మాపురం గ్రామంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాద స్థాయిలో వాగు ప్రవహిస్తుండంతో, పోలీసులు గుర్తించి ఆ రహదారి గుండా ఎవరూ వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంపలు వేశారు. అవేమీ పట్టించుకోకుండా 20 మంది కూలీలతో ఐచర్ వాహనం వాగు దాటేందుకు ప్రయత్నించింది. వాగులో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో ఐచర్ వాహనం  చిక్కుకుంది. కూలీలు  హహాకారాలు చేయడంతో గ్రామస్తులు పెద్దపప్పూరు పోలీసులకు విషయం తెలియజేశారు. 
 
 
వెంటనే స్పందించిన ఎస్సై మహమ్మద్ గౌస్ హిటాచిని తీసుకుని తన సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తానే స్వయంగా వాహనం మీద కూర్చుని వాగు లోకి వెళ్లి.ఒక్కొక్క మహిళను హిటాచిలోకి జాగ్రత్తగా లాక్కుని, సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పెద్దపప్పూరు పోలీసుల సహాయక చర్యలను గ్రామ‌స్తులు అభినందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొండపల్లి వివాదంపై హైకోర్టు ఆగ్రహం