Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లోకేష్ పిచ్చివాగుడు మానుకోవాలి: మంత్రి కొడాలి నాని

లోకేష్ పిచ్చివాగుడు మానుకోవాలి: మంత్రి కొడాలి నాని
, బుధవారం, 10 నవంబరు 2021 (19:19 IST)
మంత్రి కొడాలి నాని ఎప్పట్లానే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై నిప్పులు చెరిగారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...
 
"1- ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు మాట తప్పరు, మడమ తిప్పరు. ఎయిడెడ్‌ విద్యా సంస్థల విలీనంపై ఎక్కడా బలవంతం చేయటంలేదు. పూర్తిగా స్వచ్ఛందమే. 
 
2- అనంతపురం వెళ్ళి నారా లోకేష్‌ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఎయిడెడ్‌ జీవోను వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. చంద్రబాబులా పొద్దున్న జీవోలు ఇవ్వడం మధ్యాహ్నానికి క్యాన్సిల్‌ చేసుకోవడం, సాయంత్రానికి ఒకమాట, తెల్లారేపాటికో మాట మార్చడం జగన్‌గారి రక్తంలో లేదు.

-బాబూ, కొడుకులు పొద్దున జీవోలు ఇచ్చి సాయంత్రం ఉపసంహరించుకునే చెత్త కార్యక్రమాలు చేసేవారు. నారా లోకేష్‌కు ఒళ్లు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. అందుకే పిచ్చి వాగుడు వాగుతున్నాడు.
 
3- చవట దద్దమ్మ లోకేష్‌ ఈ జీవోను పూర్తిగా చదివినట్లు లేదు. ఆ జీవోలో స్పష్టంగా ఉంది. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను యాజమాన్యం నడుపుకోవాలనుకుంటే యథావిధిగా నడుపుకోవచ్చు. ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాం. అయితే మౌలిక వసతులతో పాటు, టీచింగ్‌ స్టాఫ్‌ లేకున్నట్లు అయితే ప్రభుత్వానికి అప్పగిస్తే వాటిని తీసుకుని, ప్రభుత్వమే నడిపిస్తుందని ఆ జీవోలో చెప్పడం జరిగింది. 
 
4- నారా లోకేష్‌ ఇష్టం వచ్చినట్లు పదేపదే ముఖ్యమంత్రిగారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇలానే నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడితే.. లోకేష్‌, చంద్రబాబులకు తగిన శాస్తి జరుగుతుందని హెచ‍్చరిస్తున్నాం. 
 
5- లోకేష్ అనంతపురం వెళ్లి ఉద్యమం చేస్తాను, ముందు ఉన్నాను, వెనుక ఉంటాను అని చెబుతున్నాడు. సంఘటన జరిగి మూడు రోజులు అయింది. ప్రభుత్వం వెంటనే స్పందించింది. అక్కడ ఎయిడెడ్‌ విద్యా సంస్థలను కొనసాగించాలంటూ టీడీపీ, కమ్యూనిస్ట్‌ పార్టీలకు చెందిన విద్యార్థి విభాగాలు కలిసి చేసిన నిరసన హింసాత్మక ఘటనకు దారి తీసింది. అక్కడ పోలీసుల మీద రాళ్లు, చెప్పులు వేసి, విద్యార్థులకు గాయాలు అయ్యేలా ప్రవర్తించారు.
 
6- తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలు చేస్తూ, శవాలను పీక్కుతినే గుంటనక్కలా కాచుకు కూర్చునే చంద్రబాబు నాయుడుకు అవకాశం దొరికిందన్నట్లుగా.. తాను కాకుండా తన కొడుకు లోకేష్ ను అనంతపురానికి పంపించాడు. అనంతపురం వెళ్లి జగన్‌గారిని నోటికొచ్చినట్లు మాట్లాడాడు. "నేను వచ్చాను కాబట్టి మళ్లీ మొదలు పెట్టండి. నేను లెగిస్తే మనిషిని కాదు.. ఈ ప్రభుత్వాన్ని అలా చేస్తా, ఇలా చే​స్తా.. మంత్రులను ఇళ్లకు వచ్చి కొడతాం. ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని" లోకేష్ చెబుతున్నాడు.

‘లోకేష్... దమ్ముంటే రా... చంద్రబాబు కొడుకువు అయితే రా. ముఖ్యమంత్రిగారి గుమ్మాన్ని వచ్చి ముట్టుకో. తోలు వలిచి చెప్పులు కుట్టిస్తాం’. తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి... అయినా ఎమ్మెల్యేగా కూడా గెలివలేని ఈ చవట దద్దమ్మ అధికారంలోకి వస్తాడా? నోటికి ఎంత వస్తే అంత వాగడం తప్ప ఏం తెలుసు?. జంతువులా ఒళ్లు పెంచితే మీ నాన్న గదిలో పెట్టి బంధించి చీవాట్లు పెట్టింది నిజం కాదా...  రెండున్నరేళ్లకు అధికారంలోకి వస్తాం మీ సంగతి తేలుస్తాం..  కొడుకుల్లారా.. అంటూ లోకేష్ మంత్రుల్ని, పోలీసుల్ని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. నోరు అదుపులో పెట్టుకోవాలి. 
 
7- లోకేష్ మాటలు, చేష్టలు చూసి ఇలాంటి కొడుకు ఎందుకు పుట్టాడని..  చంద్రబాబు రోజూ వెక్కివెక్కి ఏడుస్తుంటే... లోకేష్‌ మాత్రం వూళ్లో వాళ్లందర్ని కొడకల్లారా అని వాగుతున్నాడు. ఆఖరికి 25వేలు ఓటర్లు ఉన్న సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాల్టీలో గెలవడానికే చంద్రబాబు పడి చస్తుంటే... లోకేష్‌ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తాడా.. అధికారంలోకి వస్తారా? బాబు ముఖ్యమంత్రి అవడు, కొడుకు ఎమ్మెల్యే అవడు... ఇక అధికారంలోకి ఎలా వస్తారు?
 
8- చంద్రబాబు నాయుడే కంటే పెద్ద గుంటనక్క ఎవరైనా ఉన్నారా? కాంగ్రెస్‌ పార్టీలో ఓడిపోయి ఎన్టీఆర్‌ పెట్టిన టీడీపీలో చేరి... ఎన్టీ రామారావుకే వెన్నుపోటు పొడిచి, ఆయన్ను పార్టీ నుంచి మెడపెట్టి బయటకు గెంటి, చెప్పుల దండ వేయించిన నిష్ట దరిద్రుడు, దుర్మార్గుడు. ఇలాంటి సన్నాసులు, శుంఠలైన లోకేష్‌ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీళ్లను జనం తరిమి తరిమి కొడతారు.
 
9- లోకేష్‌ బ్లడ్‌లో కొవ్వు బాగా పెరిగితే డాక్టర్లు 30-40 కేజీల కొవ్వు తీశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న విద్యా వ్వవస్థను సర్వనాశనం చేశాడు. 

- వైఎస్‌ జగన్‌గారు ముఖ్యమంత్రిగారు అయ్యాక 45వేల పాఠశాలల్లో 15వేల పాఠశాలలను రూ 3,600 కోట్లు పెట్టి నాడు-నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేశారు. చంద్రబాబు హయాంలో నాలుగు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు వదిలేసి వెళ్లిపోయారు. అదే వైయస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే ఆరు నుంచి ఎనిమిది లక్షలమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరి చదువుకుంటున్నారు. 

- అందుకు కారణం జగనన్న అమలు చేస్తున్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, గోరుముద్ద తదితర పథకాలతోపాటు ప్రభుత్వ స్కూళ్ళలో లభిస్తున్న నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలు కూడా. ముఖ్యమంత్రిగారు రాష్ట్రంలోని విద్యార్థులందర్నీ తమ సొంత పిల్లలుగా చూస్తూ, వారి అభ్యున్నతికి, వారి బంగారు భవిష్యత్తుకు పాటు పడుతున్నారు" అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖపట్నం నుంచి శబరిమలకు ఆర్టీసీ సర్వీసులు