Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి ఎదురుగా కూరగాయ షాపు పెట్టాడని... చిరువ్యాపారిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపేసిన పోలీస్ ఆఫీసర్ కుమారుడు!!

ఠాగూర్
గురువారం, 4 ఏప్రియల్ 2024 (13:18 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో దారుణం జరిగింది. ఓ పోలీస్ అధికారి కొడుకు ఒకడు వీధిలో కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపేశాడు. తమ ఇంటి ముందు కూరగాయల దుకాణం పెట్టాడన్న కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. దీనికి  సంబంధించిన వీడియోను సచిన్ గుప్తా అనే యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. 
 
జైపూర్‌లోని రజనీ విహార్ కాలనీలో మోహన్ అనే వ్యక్తి ఓ చిరు వ్యాపారి. ఓ వీధిలో కూరగాయలు అమ్ముకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే, క్షితిజ్ అనే వ్యక్తి ఓ పోలీస్ అధికారి కుమారుడు. తమ ఇంటి ముందు మోహన్ కూరగాయల షాపు పెట్టాడు. అది నచ్చని క్షితిజ్ ఇంట్లో నుంచి క్రికెట్ బ్యాటు తీసుకుని వెళ్లి మోహన్ తలపై మూడుసార్లు బలంగా బాదాడు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చిరు వ్యాపారి అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో అవి వైరల్ అయ్యాయి. ఈ వీడియోలోని దృశ్యాల ఆధారంగా నిందితుడు క్షితిజ్‌ను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కాగా క్షితిజ్ తండ్రి భజన్‌లాల్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో పోలీస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు ఆంక్షలు

పద్యాలని ఎయన్నార్ సొంతగా పాడిన సినిమాకు 80 వసంతాలు

ముఫాసా: కు మహేష్ బాబు ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు : నమ్రతా శిరోద్కర్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments