Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

IPL 2024: ఉప్పల్ స్టేడియం ఊగిపోయింది.. రికార్డుల మోత మోగింది...

srh - mi

వరుణ్

, గురువారం, 28 మార్చి 2024 (09:54 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 పోటీల్లో భాగంగా, బుధవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబై జట్టు వరుసగా తన రెండో ఓటమిని చవిచూసింది. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు చెలరేగిపోయింది. సొంత గడ్డతో పాటు సొంత ప్రేక్షకుల మధ్య హైదరాబాద్ బ్యాటర్లు వీరవిహారం చేశారు. ఫలితంగా ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 277 పరుగుల భారీ స్కోరు చేశారు. ఆ తర్వాత భారీ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన ముంబై జట్టు కూడా ఆరంభం నుంచి అదే ఊపును కనబరిచింది. చివరకు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. అయితే, కీలక సమయంలో ప్రధాన వికెట్లను కోల్పోవడంతో పాటు భారీ రన్‌రేట్ కారణంగా మ్యాచ్ ఆఖరులో ఆ జట్టు విజయానికి మరో 32 పరుగుల దూరంలో వచ్చి ఆగిపోయింది. కాగా, ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డు వివరాలను పరిశీలిస్తే, 
 
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టు హైదరాబాద్ - 277
సెకండ్ ఇన్నింగ్స్‌‍ల్లోనూ అత్యధిక స్కోర్ నమోదు.. ముంబై 246
ఒక మ్యాచ్‌లో రెండు జట్ల మొత్తం స్కోర్ - 523
2023లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మొత్తం స్కోర్ 517 పరుగులు
పురుషుల టీ20, ఐపీఎల్ టోర్నీలో ఇదే (529) అత్యధిక స్కోర్
ఐపీఎల్లో 2010లో చెన్నై, రాజస్థాన్ జట్లు కలిసి 469 పరుగులు చేశాయి.
ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధికంగా నమోదైన సిక్సులు - 38
పురుషుల టీ20 టోర్నీలో అత్యధిక నమోదైన సిక్స్‌లు నమోదైన మ్యాచ్ ఇదే - 38
ఈ మ్యాచ్‌లో మొత్తం నమోదైన సిక్స్‌లు, ఫోర్లు 69. 2010లో చెన్నై, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 69 బౌండరీలు ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు కొట్టిన సిక్స్‌ల సంఖ్య 20. అంతకుముందు 2013లో బెంగళూరు బ్యాటర్లు 21 సిక్స్‌లు కొట్టారు.
తొలి 10 ఓవర్లలో సన్ రైజర్స్ స్కోరు 148. గత రికార్డు (2014లో పంజాబ్, 2021లో ముంబై 131 పరుగులు) కనుమరుగైంది.
అర్థశతకం సాధించేందుకు అభిషేక్ శర్మ ఆడిన బంతులు 16. సన్ రైజర్స్ తరపున ఐపీఎల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్ అతనే.
ఓ ఐపీఎల్ మ్యాచ్లో ఒకే జట్టు నుంచి 20 బంతుల్లోపే అర్థశతకాలు పూర్తి చేసుకున్న తొలి ద్వయంగా హెడ్ - అభిషేక్ నిలిచారు.
ముంబై పేసర్ మపాక సమర్పించుకున్న పరుగులు 66. ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్నది అతనే.
ముంబై తరపున ఐపీఎల్లో రోహిత్ ఆడిన మ్యాచ్‌ల సంఖ్య 200. ఆ జట్టు తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడింది అతనే. ఈ సందర్భంగా మ్యాచ్‌కు ముందు రోహిత్క సచిన్ 200 నంబరుతో కూడిన ప్రత్యేక జెర్సీ, టోపీ బహుకరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హార్దిక్ పాండ్యా కెప్టెన్ అధమస్థాయికి దిగజారింది... ఇర్ఫాన్ పఠాన్