ఆత్మార్పణ చేసుకుంటే దేవుడుకి దగ్గరవుతాం... స్వర్గం ప్రాప్తిస్తుందంటూ మహిళ ఆత్మహత్య

ఠాగూర్
ఆదివారం, 3 ఆగస్టు 2025 (08:44 IST)
ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. నిరంతరం దైవధ్యానంలో ఉంటూ ఆత్మార్పణ చేసుకుంటే దేవుడికి దగ్గరవుతాం, స్వర్గం ప్రాప్తిస్తుంది అని భావించిన ఆ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ గరంలోని హిమాయత్ నగర్‌లో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హిమాయత్ నగర్‌క చెందిన అరుణ్ కుమార్ జైన్ అనే వ్యక్తితి భార్య పూజా జైన్ (43) నివసిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నాడు. గత ఐదేళ్లుగా పూజ మానసిక సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఆమెకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువైపోయింది. 
 
ఈ క్రమంలో అరుణ్ కుమార్ జైన్ శనివారం ఆఫీసుకు వెళ్ళగా, ఇంట్లో పిల్లలు, పని మనిషి మాత్రమే ఉంది. మధ్యాహ్నం వరకు ఒంటరిగా గదిలో కూర్చున్న పూజా ఊహించని విధంగా ఐదో అంతస్తు నుంచి కిందకు దూకేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, ఆమె అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
పూజ ఆత్మహత్య చేసుకునే ముందు కూర్చొన్న గదిలో ఒక లేఖ లభించింది. ఆ లేఖలో జైన గురువు సూక్తిని ఉంటంకిస్తూ, నిరంతరం దైవధ్యానంలో ఉంటూ ఆత్మార్పణ చేసుకుంటే దేవుడికి దగ్గరవుతాం. స్వర్గం ప్రాప్తిస్తుంది" అని అర్థం వచ్చేలా రాసి ఉందని పోలీసులు తెలిపారు. ఈ లేఖ మూఢనమ్మకాలతో పాటు ఆమె మానసికస్థితి ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dixit Shetty: ప్రేమ కథని మరో కోణంలో చూపించే ది గర్ల్ ఫ్రెండ్ - దీక్షిత్ శెట్టి

Chinmayi Vs Jani Master: జానీ మాస్టర్, ప్లేబ్యాక్ సింగర్ కార్తీక్‌‌లపై విమర్శలు.. కర్మ వదిలిపెట్టదు..

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments