Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యాంగ బాలికను ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి అఘాయిత్యం.. ఆ తర్వాత..

ఠాగూర్
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (13:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలంలో ఓ దారుణం జరిగింది. దివ్యాంగ బాలికను ఓ కామాంధుడు ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. 
 
కదిరి డీఎస్పీ శ్రీలత తెలిపిన మేరకు.. స్థానిక సారగుండ్లపల్లికి చెందిన నాగార్జున (32) వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ వలంటీరుగా పనిచేశాడు. రెండేళ్ల క్రితం అతనికీ వివాహమైంది. ఆదివారం తన భార్యను పుట్టింట్లో వదిలిపెట్టేందుకు వెళ్లిన నాగార్జున అదేరోజు రాత్రి తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో అదే మార్గంలోని ఓ ఊరిలో దివ్యాంగ బాలిక, మరికొందరు చిన్నారులు కలిసి ఆడుకుంటూ కనిపించారు.
 
దీంతో నాగార్జున.. దివ్యాంగ బాలికను ముళ్ల పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఇది చూసిన చిన్నారులు కేకలు వేయడంతో గ్రామస్థులతో పాటు బాలిక తండ్రి అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా స్వగ్రామానికి పారిపోయాడు. అక్కడ నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని రాసుకున్న సూసైడ్ నోట్ రాసి పెట్టగా, దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments