Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

సూత్రధారి కాంతిరాణా టాటా... ఏపీ పోలీసులే కిడ్నాప్ చేశారు: కాందంబరి జైత్వానీ

Advertiesment
kadambari jaitwani

ఠాగూర్

, శనివారం, 31 ఆగస్టు 2024 (11:22 IST)
తనను కిడ్నాప్ చేసి చిత్రహింలకు గురిచేయడంలో ప్రధాన సూత్రధాని నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా అని ముంబై నటి జైత్వానీ కాదంబరి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె శుక్రవారం విజయవాడ నగరానికి వచ్చిన పోలీసులకు ఫిర్యాదు చేయడమేకాకుండా, స్వయంగా వాంగ్మూలం ఇచ్చారు. ఆ తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కన్నీటి పర్యంతమయ్యారు. నిజాలు బయటికి రావాలన్న ఉద్దేశంతోనే ఇవాళ విజయవాడ వచ్చానని వెల్లడించారు. దేశంలో మంచి వాళ్లు ఉన్నారని, వారంతా తనకు మద్దతుగా నిలవాలని కోరారు.
 
తనపై అక్రమ కేసు నమోదు చేశారని ఆరోపించారు. తాను, తన కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు చెప్పారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని, అనేక రకాలుగా వేధించారని వివరించారనీ, వేధింపులకు సంబంధించి తన వద్ద ఉన్న అన్ని సాక్ష్యాధారాలను పోలీసులకు అందించినట్టు చెప్పారు. 
 
వైకాపా నేత కుక్కల విద్యాసాగర్‌పై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆమె తెలిపారు. విద్యాసాగర్ పెళ్లి ప్రస్తావన తెచ్చాడని, కానీ అందుకు తాను వ్యతిరేకించానని చెప్పారు. దాంతో, విద్యాసాగర్ తనపై అసూయతో కక్షగట్టాడని ఆమె ఆరోపించారు.
 
ఈ క్రమంలో జరిగిన పరిణామాల నేపథ్యంలోనే పోలీసు అధికారి కాంతిరాణా టాటా నేతృత్వంలో తనపై తప్పుడు కేసు పెట్టారని వెల్లడించారు. తనను 10 నుంచి 15 మంది ఏపీ పోలీసులు కిడ్నాప్ చేశారన్నారు. వారు తక్కువ స్థాయి అధికారులు అయ్యుంటారన్నారు. తన డివైస్‌లన్నీ స్వాధీనం చేసుకున్నారని వివరించారు.
 
ఈ వ్యవహారంలో పొలిటికల్ లీడర్లకు సంబంధం ఉందా అనేది విచారణలో తేలాల్సి ఉందని అన్నారు. ఇప్పటివరకు తాను చెప్పినవన్నీ నిజాలేనని కాదంబరి జెత్వానీ స్పష్టం చేశారు. వేధింపుల కారణంగా తన తల్లిదండ్రుల ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని చెబుతూ ఆమె భోరున విలపించారు.


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, ఆయ్ లో పెర్ఫామెన్స్ చూసి అభినందించారు: న‌య‌న్ సారిక‌