Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గదుల్లో అమర్చిన స్పై కెమెరాలు.. కపుల్స్ సన్నిహిత వీడియోలను..?

Advertiesment
couple

సెల్వి

, బుధవారం, 28 ఆగస్టు 2024 (17:20 IST)
గదుల్లో అమర్చిన స్పై కెమెరాలతో కపుల్స్ సన్నిహిత వీడియోలను రికార్డ్ చేసి, వారి నుండి డబ్బు వసూలు చేసిన హోటల్ యజమానిని ఆర్జీఐ ఎయిర్‌పోర్ట్ పోలీసులు అరెస్టు చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గణేష్ అనే వ్యక్తి హైదరాబాద్-బెంగళూరు హైవేపై అద్దెకు భవనం తీసుకుని రెండేళ్ల క్రితం హోటల్ ప్రారంభించాడు. పెళ్లికాని యువకులకు గదులు అద్దెకు ఇచ్చి వారి నుంచి ఛార్జీలుగా చిన్న మొత్తాలను వసూలు చేశాడు.
 
గణేష్ హోటల్ బుక్ చేసే పుస్తకాల్లో వారి ఫోన్ నెంబర్లను ఇతర వివరాలను కలెక్ట్ చేసుకునే వాడు.  ఆ తర్వాత వారికి ఫోన్‌లో కాల్ చేసి, వారి సన్నిహిత వీడియోలను బయటపెడతానని బెదిరించి వారి నుంచి డబ్బులు వసూలు చేసేవాడని ఆర్‌జీఐ ఎయిర్‌పోర్ట్ ఇన్‌స్పెక్టర్ బాలరాజ్ తెలిపారు.
 
గణేష్ వద్ద బలవంతంగా డబ్బులు పోగొట్టుకున్న ఓ జంట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకుని విచారించగా అతడి తీరు వెలుగులోకి వచ్చింది. 
 
గణేష్ గదిలోని స్విచ్ బోర్డులు, సీలింగ్‌లో స్పై కెమెరాలను అమర్చాడని, ఇలా దంపతుల సన్నిహిత క్షణాలను రికార్డ్ చేశాడు. తర్వాత వారిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడని ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు. గణేష్ నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు పలు వీడియోలను గుర్తించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫెమా ఉల్లంఘనలు... డీఎంకే ఎంపీకి రూ.908 కోట్ల అపరాధం!!