Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుణాచల కొండపై విదేశీ మహిళపై గైడ్ అఘాయిత్యం!

ఠాగూర్
గురువారం, 20 మార్చి 2025 (09:09 IST)
పవిత్ర తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి కొండపై దారుణం జరిగింది. అరుణాచల దర్శనానికి వచ్చి తిరువణ్ణామలై కొండపై ధ్యానంలో నిమగ్నమైవున్న ఓ విదేశీ మహిళపై గైడ్ ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసులో భాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడుని అరెస్టు చేశారు.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఫ్రాన్స్‌కు చెందిన 40 యేళ్ల మహిళ గత జనవరిలో తిరువణ్ణామలై సందర్శన కోసం వచ్చారు. ఈ క్రమంలో గిరి ప్రదక్షిణ దారిలో ఓ ప్రైవేటు ఆశ్రమంలో ఆమె బస చేశారు. ఆలయం వెనుక ఉన్న మరో దారిలో కొండపైకి వెళ్ళి ధ్యానంలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం ఆమె స్థానికంగా ఉండే ఓ గైడ్ సాయం తీసుకునేవారు.
 
మూడు రోజుల క్రితం ఇలానే గైడ్ సాయంతో కొండపైకి వెళ్లి ధ్యానం చేస్తుండగా గైడ్ ఆమెపై లైంగికదాడిగి తెగబడ్డాడు. ఆ తర్వాత ఆ కామాంధుడు నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడుని అరెస్టుచేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments