Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవిడ ఓ వ్యభిచారి.. ఈవిడ కావాలంటే ఈ నంబరుకు కాల్ చేయండి...

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (15:17 IST)
ఈవిడ ఓ వ్యభిచారి... ఈవిడ కావాలంటే ఈ నంబరుకు కాల్ చేయండి అంటూ కిరాతక భర్త తన భార్య గురించి చేసిన దుష్ప్రచారం చివరకు ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన ఏపీలోని ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమక్కపేట గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రమణక్కపేట గ్రామానికి చెందిన నాగుల్ మీరా అనే వ్యక్తిని జ్యోత్స ప్రేమ వివాహం చేసుకుంది. వీరి ప్రేమకు చిహ్నంగా ఇద్దరు పిల్లలు పుట్టారు. కానీ ఇంతలో ఏమైందో ఏమైగానీ, భార్యపై మీరాకు అనుమానం అనే జబ్బు చేసింది. అప్పటి నుంచి భార్యను వేధించసాగాడు. ఈ వేధింపులు భరించలేని జ్యోత్స భర్తను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భార్యపై ఆయనకు మరింత అనుమానం పెరిగడంతో ఆమె వద్దకు వెళ్లి వేధించసాగాడు. 
 
ఈ క్రమంలో జోత్స్న తమ్ముడిని కూడా నాగుల్ మీరా చితకబాదాడు. దీనిపై తన భర్తపై జ్యోత్స్న పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కానీ, పోలీసులు మాత్రం తగిన చర్యలు తీసుకోలేదు. దీంతో మరింతగా రెచ్చిపోయిన నాగులు.. ఈవిడ వ్యభిచారి.. ఈవిడ కావాలంటే ఈ నంబరుకు కాల్ చేయండి అని మెసేజ్‌లు పెట్టడంతో ఆమెకు ఫోన్ కాల్స్ విపరీతంగా రాసాగాయి. దీనిపై కూడా ఫిర్యాదు చేసిన పోలీసులు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. అయితే, భార్యపై మరింత కక్ష పెంచుకున్న భర్త ఆమెను కొట్టి చంపేశాడు. దీనిపై పోలీసులు కోసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments