Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడుముపై టాటూ వేయమని పడుకున్న యువతి, మెడపై కత్తి పెట్టి అత్యాచారం చేసిన వ్యక్తి

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (19:23 IST)
అతనో పేరు గాంచిన టాటూ స్టూడియోను నడుపుతున్నాడు. ఏకాంతంగా టాటూ వేసుకోవచ్చు. అందరికీ తెలిసేలా టాటూలు వేసుకోవచ్చు. ఇలా అతని దగ్గర ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. అదే చాలామంది యువతుల పాలిట శాపంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. ఒక యువతి ధైర్యం చేసి పోలీసులకు చెప్పడంతో అసలు బాగోతం బయటపడింది.

 
కోచికి చెందిన సుజీష్ అనే వ్యక్తి పదేళ్ళుగా టాటూ స్టూడియో నిర్వహిస్తున్నాడు. ఎంతోమంది యువతులు అక్కడకు వెళ్ళి టాటూ వేయించుకుంటూ ఉంటారు. సుజీష్ షాపు అంటే నమ్మకం. ఎందుకంటే ఏకాంతంగా ఎవరికీ తెలియకుండా ఏ ప్లేస్‌లో కావాలంటే ఆ ప్లేస్‌లో టాటూ వేసుకునే అవకాశం ఉంటుంది. 

 
అలాగే అందరితో కలిసి టాటూ వేసుకునేందుకు ఒక గది కూడా ఉంది. గతంలో సుజీష్‌ పైన ఎలాంటి అనుమానాలు ఎవరికీ కలుగలేదు. ప్రముఖుల పిల్లలు కూడా ఇక్కడికే వచ్చి టాటూ వేయించుకుంటూ ఉంటారు. అయితే ఒక యువతి ఒంటరిగా వెళ్ళింది. తనకు నడుముపై టాటూ వేయాలంది. అది కూడా ఏకాంత గదిలో కావాలంది. దీంతో సుజీష్ తీసుకెళ్ళి ఒక గదిలో పడుకోబెట్టాడు. టాటూ పూర్తయ్యింది. ఆ తరువాత తన దగ్గరున్న పదునైన కత్తితో మెడపై ఉంచాడు.

 
కదిలితే చంపేస్తానన్నాడు. దీంతో భయపడిన యువతి అలాగే పడుకుని పోయింది. దీంతో సుజీష్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఆ గదిలో వీడియోలు కూడా రికార్డ్ చేసినట్లు చూపించాడు. బయటకు చెబితే వీడియోలు బయట పెట్టడమే కాదు చంపేస్తానని బెదిరించాడు.

 
దీంతో ఆ యువతి నాలుగురోజుల పాటు తీవ్ర మనోవేదనకు గురైంది. తన స్నేహితురాలి సహాయంతో ధైర్యం చేసి పోలీసుస్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు  చేసింది. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి స్టూడియోలో చాలామంది వీడియోలు దొరికాయి. హార్డ్ డిస్క్‌తో పాటు అక్కడ పనిచేస్తున్ వారిని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments