Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే.. గెలిచి తీరాల్సిందే...

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (12:09 IST)
ఐసీసీ వరల్డ్ క్రికెట్ కప్‌ టోర్నీలో పాకిస్థాన్ జట్టు బుధవారం మరో కీలక మ్యాచ్ ఆడనుంది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలై తీవ్ర విమర్శలను మూటగట్టుకున్న పాకిస్థాన్ జట్టు ఆ తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం విజయం సాధించి ఊపిరిపీల్చుకుంది. బుధవారం భీకర ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేనిపక్షంలో ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే.  
 
ఈ పరిస్థితుల్లో ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి ఎరుగని న్యూజిలాండ్ జట్టుతో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తలపడనుంది. ఆరు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి, మూడింట ఓడి, ఓ మ్యాచ్ రద్దవడంతో ఏడు పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉన్న సర్ఫరాజ్ సేన.. విలియమ్సన్ సేనతో అమీతుమీ తేల్చుకోనుంది. 
 
మరి ఈ మ్యాచ్ గెలిచి పాక్ సెమీస్ రేసులో ఉంటుందా.. విజయాన్ని కివీస్‌కు కట్టబెట్టి నాకౌట్ బెర్త్ కన్ఫామ్ చేస్తుందో చూడాలి. ప్రపంచ కప్ టోర్నీల్లో ఇరు జట్లూ ఎనిమిది మ్యాచ్‌లలో తలపడగా, కివీస్ జట్టు ఆరు సార్లు, పాకిస్థాన్ జట్టు రెండు సార్లు విజయం సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Roja: భయం అనేది మా నాయకుడు జగన్ రక్తంలో లేదు.. ఆర్కే రోజా (video)

Chandrababu: అంబేద్కర్‌ను గుర్తించడంలో కీలక పాత్ర ఎవరిది..? చర్చ జరగాల్సిందే.. చంద్రబాబు

పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

తర్వాతి కథనం
Show comments