Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీవీ డిబెట్‌లో పిడిగుద్దుల వర్షం ... కరాచీ ప్రెస్ క్లబ్‌లో మినీ వార్

టీవీ డిబెట్‌లో పిడిగుద్దుల వర్షం ... కరాచీ ప్రెస్ క్లబ్‌లో మినీ వార్
, మంగళవారం, 25 జూన్ 2019 (16:35 IST)
అది లైవ్ కార్యక్రమం. రసవత్తరంగా చర్చా కార్యక్రమం సాగుతోంది. అందరూ చూస్తుండగా, ఇద్దరు నేతలు బాహాబాహీకి దిగి, పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ ఘటన పాకిస్థాన్‌‌లో జరిగింది. అధికార పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ- ఇన్సాఫ్‌ (పీటీఐ) నేత మసూర్‌ అలీ సియాల్‌, కరాచి ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు ఇంతియాజ్‌ ఖాన్‌‌లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీనికి కరాచీ ప్రెస్ క్లబ్ వేదిక అయింది. 
 
ఈ చర్చా కార్యక్రమంలో ప్రభుత్వంపై ఇంతియాజ్ విమర్శలు గుప్పిస్తుండగా, ఇద్దరు నేతల మధ్యా మాటమాట పెరిగింది. సహనం కోల్పోయిన మసూర్‌ అలీ అతన్ని కొట్టారు. దీంతో ఇంతియాజ్ సైతం ప్రతిదాడికి దిగారు. దీంతో చర్చా కార్యక్రమం రసాభాసగా మారగా, ఈ మొత్తం ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. వీరిని విడదీసేందుకు యాంకర్‌‌తో సహాయక సిబ్బంది, కార్యక్రమ నిర్వాహకులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
కాగా, చిన్నపాటి యుద్ధం తర్వాత మసూర్‌ లైవ్‌ను కొనసాగించగా, ఇంతియాజ్ మాత్రం వెళ్లిపోయారు. ఆ తర్వాత చానెల్‌ తన లైవ్ షోను కొనసాగించింది. ఈ వీడియోను పాక్‌‌కు చెందిన ఓ మహిళా జర్నలిస్ట్‌ తన ట్విట్టర్ ఖతాలో షేర్ చేసుకున్నారు. 'దాడిచేయడమేనా నయా పాకిస్థాన్‌?' అని ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారాకు అస్వస్థత.. ముంబై ఆస్పత్రిలో చికిత్స