ప్రపంచ కప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జూన్ 16వ తేదీన మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌పై 89 పరుగుల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ ఆసక్తికరమైన సన్నివేశం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. గ్యాలరీలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ యువకుడు పెళ్లి ప్రపోజల్ చేసి తన ప్రియురాలి మనస్సును గెలుచుకున్నాడు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గ్యాలరీలో ఉన్న టీమిండియా క్రికెట్ అభిమాని విక్కీ.. అక్కడే కూర్చున్న అన్వితా అనే యువతికి ఉంగరాన్ని చూపించి పెళ్లి చేసుకుంటావా అడిగాడు.
అంతే ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేసిన అన్వితా అతడి ప్రేమను అంగీకరించింది. అంతేకాదు గట్టిగా హత్తుకుని తన ప్రేమను వ్యక్తపరిచింది. అన్వితాకు విక్కీ ఉంగరం తొడిగిన అనంతరం ఇద్దరూ ముద్దెట్టుకున్నారు. ఈ సన్నివేశాన్ని చూసిన గ్యాలరీలోని ఇతర అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియోను అన్వితా ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.