Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 13 January 2025
webdunia

ప్రేమించిన అమ్మాయి ముందు.. ఇలా చేయకండి..?

Advertiesment
ప్రేమించిన అమ్మాయి ముందు.. ఇలా చేయకండి..?
, సోమవారం, 8 ఏప్రియల్ 2019 (14:59 IST)
ఇప్పటి కాలంలో ప్రేమలు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడచూసినా ప్రేమ జంటలే కనిపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. కొంతమంది అబ్బాయిలు వారు ప్రేమించిన విషయాన్ని అమ్మాయిలకు చెప్పడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. రకరకాల ప్రయత్నాలతో వారి ప్రేమ విషయాన్ని చెప్పాలని అనుకుంటారు. కానీ చెప్పలేక భయపడుతుంటారు. అలాంటివారికోసం..
 
ఇప్పటి జనరేషన్‍‌లో వారి ప్రేమకు సంబంధించి విషయాలను అధికంగా సెల్‌ఫోన్‌లో చెప్తున్నారు. ఇలా చేయడం వలన ఇష్టాయిష్టాలను నేరుగా చెప్పడానికి వీలుండదు. కనుక వీలైనంత వరకు ప్రేమ లేఖలు రాయడం మంచిది. ఇలా చేస్తే మీ మీద వారికి ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ఎందుకంటే మీ మనసులో ఉన్న భావాలను నేరుగా కాగితంపై రాయడం వలన ఆ అమ్మాయి చదివేటప్పుడు తన మనసుకు భావాలు తొందరగా దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది.
 
వీటన్నింటికంటే ముందుగా ప్రేమించిన వారి ఇష్టాయిష్టాలను తెలుసుకోవడం ఎంతైనా ముఖ్యం. వారి ఇష్టాలను పూర్తిగా తెలుసుకున్న తరువాతనే మీ మనసులో ఉన్న భావాలను చెప్పాలి. అలానే వారికి భాగా ఇష్టమైన ప్లేస్‌కు తీసుకెళ్ళి మీ ప్రేమను తెలియజేయాలి. అప్పుడే ఫలితం ఉంటుంది.

ముఖ్యంగా అబ్బాయిలు ఏవేవో పిచ్చి పనులు చేయకుండా మీరు రోజు ఎలా ఉంటారో అలానే ఉండాలి. అలా ఉండే వారినే అమ్మాయిలు ఇష్టపడుతారు. ఎట్టి పరిస్థితుల్లోను మీరు ప్రేమించిన అమ్మాయి ముందు మరో అమ్మాయిని చూడకండి.. అన్నింటికంటే ఇది చాలా ముఖ్యమైనది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పడకగదిలోని దుమ్మును తొలగించేందుకు...?