Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓట్స్‌ను ఉడికించి నిమ్మరసం కలిపి.. ఇలా చేస్తే..?

ఓట్స్‌ను ఉడికించి నిమ్మరసం కలిపి.. ఇలా చేస్తే..?
, సోమవారం, 8 ఏప్రియల్ 2019 (11:16 IST)
సాధారణంగా ప్రతీ స్త్రీ కోరుకునేది తాను అందంగా ఉండాలనే.. అలాంటివారు ఇప్పటి వేసవికాలంలో అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కాస్త కూడా తేడా కనిపించడం లేదు. ఉన్న అందం కూడా పోతుంది దేవుడా అంటూ బాధపడుతుంటారు. వేసవిలో మీ అందాన్ని రెట్టింపు చేయాలంటే ఈ ఫేస్‌ప్యాక్స్ వేసుకుంటే చాలంటున్నారు. మరి ఆ ఫేస్‌ప్యాక్స్ ఏంటో వాటిని ఎలా వేసుకోవాలో చూద్దాం...
 
గ్రీన్ టీ ఫేస్‌ప్యాక్:
కప్పు గ్రీన్ టీ వాటర్, 2 స్పూన్స్ బియ్యం పిండి, స్పూన్ తేనె కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి అరగంటపాటు అలానే ఉంచుకోవాలి. ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారంలో రెండుమూడుసార్లు క్రమంగా చేస్తుంటే.. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అయితే.. ఈ ఫేస్‌ప్యాక్‌ను స్నానం చేయడానికి ముందు వేసుకోవాలి. అప్పుడే గ్రీన్ టీలోని యాంటి ఆక్సిడెంట్స్ చర్మంలోని మురికిని, మృతకణాలను తొలగిస్తాయి. ఈ మిశ్రమంలో తేనెను కలపడం వలన చర్మం బ్యాక్టీరియా బారిన పడదు. చర్మం తేమతత్వాన్ని కలిగి ఉంటుంది. 
 
ఓట్స్‌ ఫేస్‌ప్యాక్:
2 స్పూన్ల ఓట్స్‌ను బాగా ఉడికించుకుని అందులో స్పూన్ నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకోవాలి. 20 నిమిషాలు అలానే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేసుకుని మెత్తటి టవన్‌తో సున్నితంగా ముఖాన్ని తుడుచుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ను ఉదయాన్నే స్నానానికి ముందుకు రాసుకోవాలి. ఇలా తరుచు చేయడం వలన ముఖచర్మం మృదువుగా, తాజాగా మారుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెంతులు నానబెట్టిన నీరు తాగితే.. ఏమవుతుంది..?