Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసే వ్యక్తి...?

Advertiesment
ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసే వ్యక్తి...?
, మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (13:11 IST)
సాధారణంగా ఓ వయసు వచ్చిన తరువాత టీనెజ్‌లో ఉన్నప్పుడు స్త్రీ, పురుషులు ప్రేమకు ఆకర్షితులవుతుంటారు. కానీ కొంతమంది ప్రేమను తెలిపినప్పుడు వెంటనే స్పందిస్తారు, మరికొంత మంది కొంచెం నిదానంగా స్పందిస్తారు. మరికొందరికైతే ప్రేమంటే పడదు, ప్రేమన్న, ప్రేమించడం అన్నా ఇష్టముండదు. అటువంటి వారికోసం కొన్ని చిట్కాలు..
 
ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసే వ్యక్తి మీ మనస్సును కంట్రోల్ చేసే అవకాశం ఇవ్వాలి. అటువంటి వ్యక్తి గురించి ఆలోచనలను ఆపడానికి కష్టంగా ఉంటుంది. కనుక మీ అంతట మీరు కొత్త పనులు ఏవైనా చేయడానికి వాటిమీద దృష్టి పెట్టండి. అలానే మీరు ఒంటరిగా లేదా ఖాళీగా ఉన్నట్టు అనుభూతి కలుగుతున్నా వేరే ఆలోచనల వలన మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోగలుగుతారు. 
 
లేట్‌నైట్ మెసేజ్‌లు లేదా ఫోన్ కాల్స్‌తో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం నివారించాలి. అలాంటి సందర్భాల్లో మీరు తప్పకండా గుర్తుంచుకోవాల్సింది.. వ్యక్తులతో మీరు మరింత స్నేహంగా మెలగకుండా ఉండాలి.. మరింత లోతుగా వెళ్ళడం వలన అది మీకే మంచిది కాదు.

సాధారణంగా ప్రతీ ఒక్కరిలో ఏదో ఓ లోపం ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నా, ప్రేమను వ్యక్తపరచినా, మీకు ఇష్టం లేకపోతే వారిలోని లోపాలను వెతికి చెప్పాలి. మీరు నిజంతా అతని ప్రేమను నిరాకరించాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నప్పుడు, మీరు మీకు నచ్చిన వ్యక్తులు మీద మీ దృష్టిని మళ్ళించేందుకు ప్రయత్నించాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చింతచిగురుతో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్