Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయ్యాక పని చేయకూడదని డిసైడ్ అయ్యాను.. నిజం చెప్పిన అనుష్క శర్మ

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (16:23 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, సినీనటి అనుష్క శర్మ జీరో సినిమా తర్వాత కొంతకాలం నటజీవితానికి విరామం ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఎల్ ఆనంద్ రాయ్ తీస్తున్న జీరో సినిమా తర్వాత తన కొత్త సినిమా గురించి అనుష్క ఇంకా ప్రకటన ఏదీ చేయలేదు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పెళ్లాడి ఆడపిల్లకు జన్మనిచ్చిన అనుష్క తన ప్రొడక్షన్ హౌస్ పనులను చూసుకుంటూనే తన బిడ్డ బాగోగులను స్వయంగా పట్టించుకుంటోంది.
 
కరోనా లాక్ డౌన్ కాలంలో బుల్ బుల్ మరియు పాతాళ్ లోక్ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాలను నిర్మించిన అనుష్క శర్మ గతంలో సిమీ గర్వాల్ పాపులర్ షోలో పాల్గొన్న వీడియో క్లిప్ ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కంటానని.. పెళ్లాడినట్లయితే ఆపై తాను పనిచేయకూడదని అనుకుంటున్నాను అని అనుష్క చెప్పింది. గ్రేజియా మేగజైన్‍కి ఇచ్చిన మరొక ఇంటర్యూలో సినిమాలకు తాను ఎందుకు విరామం ఇవ్వాలనుకున్నది కూడా అనుష్క బయటపెట్టింది.  
 
ఇకపోతే.. 2018లో వరుణ్ ధావన్‌తో కలిసి సూయి దాగా సినిమాలో షారుఖ్ ఖాన్‌తో కలిసి జీరో సినిమాలో నటించిన అనుష్క ఇప్పుడు ఒక సినిమా చేస్తోంది. పైగా ఆమె ప్రొడక్షన్ కంపెనీ అయిన క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ త్వరలో మాయి అనే పేరున్న సీరీస్‌ని నెట్ ప్లిక్స్‌లో విడుదల చేయనుంది. ఇప్పటికైతే తన తదుపరి చిత్రాల గురించి అనుష్క అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ ఏప్రిల్ చివరినాటికి ఆమె తిరిగి నటనా వృత్తిలోకి అడుగుపెడుతుందని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కిడ్నీదానం చేసి భర్తను బతికించుకున్న మహిళ.. లారీ రూపంలో మృత్యువు వెంటాడింది...

ప్రమాదం ఘంటికలు మోగిస్తున్న గులియన్ బారీ సిండ్రోమ్... ఈ లక్షణాలు వుంటే సీబీఎస్

మనీలాండరింగ్ కేసులో మారిషస్ మాజీ ప్రధాని అరెస్టు

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వజ్రాలు పొదిగివున్న నెక్లెస్ స్వాధీనం...

ఊగిపోయిన ఢిల్లీ రైల్వే స్టేషన్.. వణికిపోయిన ప్రయాణికులు.. ఎందుకంటే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments