Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్ రైజర్స్ క్రికెట్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. డేవిడ్ వార్నర్ వచ్చేస్తున్నాడోచ్!

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (22:05 IST)
మీరు హైదరాబాద్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ క్రికెట్ టీమ్‌కు ఫ్యాన్ అయితే పండగ చేసుకునే వార్త మీ కోసం రెడీగా వుంది. చెన్నై వేదికగా జరిగే ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును ఢీకొట్టనుంది.
 
ఏప్రిల్‌ 11న ఇదే వేదికగా జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ రూల్స్ మేరకు ఆటగాళ్లందరూ వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. 
 
అందుకే విదేశీ ఆటగాళ్లంతా ముందే ఇండియాకు పయనమవుతున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021లో ఎస్‌ఆర్‌హెచ్ టీం కెప్టెన్ డేవిడ్ వార్నర్ పాల్గొంటున్నాడు. ఈ మేరకు ఇండియాకు బయలుదేరినట్లు ఆయన తన ఇన్‌స్టాగ్రాంలో ఓ ఫొటోను షేర్ చేశాడు. దీంతో అటు టీంతో పాటు ఫ్యాన్స్‌లోనూ ఆనందం వెల్లివిరుస్తోంది.
 
గజ్జల్లో గాయం కారణంగా తొలి విడత ఐపీఎల్‌కు వార్నర్ దూరం అవ్వనున్నాడనే వార్తల నేపథ్యంలో... వార్నర్ అందరికీ గుడ్ న్యూస్ చెప్పాడు. భారత్‌కు  బయలుదేరే ముందు తన కుటుంబంతో కలసి విందును ఎంజాయ్ చేసిన ఫోటోను షేర్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ నీతులు చెప్పడం హాస్యాస్పదం : అద్దంకి దయాకర్

వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్‌లో నిరసనలు : మద్దతు ప్రకటించిన ఎలాన్ మస్క్

మానసిక సమస్యతో బాధపడుతున్న కొడుకును చూడలేక....

మద్యం మత్తులో పాఠశాల వంట మనిషిపై విద్యార్థుల దాడి

ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. తృటిలో తప్పిన ప్రమాదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సెలెబ్రిటీలకు ఈడీ నోటీసులు

దివ్యాంగ డ్యాన్సర్లకు రాఘవ లారెన్స్ కరెన్సీ అభిషేకం (Video)

Sai Tej: పేరెంట్స్‌తో విషయాలు పంచుకునేలా పిల్లలుండాలి - సాయి దుర్గ తేజ్

విశ్వప్రసాద్, డైరెక్టర్ కార్తీక్ రెండు పిల్లర్ లా మిరాయ్ రూపొందించారు : తేజ సజ్జా

Kantara 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం సాంగ్ రికార్డ్ చేసిన దిల్‌జిత్

తర్వాతి కథనం
Show comments