భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇటీవలే ముగిసింది. ఈ టోర్నీలో భారత జట్టు 3-2 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే, చివరిదైన ఐదో టీ20లో స్లో ఓవర్‌రేట్ కారణంగా టీమిండియాకు భారీగా జరిమానా విధించారు.
శనివారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో భారత జట్టు రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో మ్యాచ్ రెఫరీ జవగళ్ శ్రీనాథ్ టీమిండియా మ్యాచ్ ఫీజులో 40 శాతం ఫైన్ వేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ తమ తప్పిదాన్ని ఒప్పుకోవడంతో పాటు జరిమానాకు కూడా అంగీకారం తెలిపాడు.
చివరి టీ20లో భారత్ 36 పరుగులతో విజయం సాధించి సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకున్నది. భారత్‌తో నాలుగో టీ20లో ఒక ఓవర్ తక్కువగా వేయడంతో ఇంగ్లాండ్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20శాతం జరిమానా విధించిన విషయం తెల్సిందే. ఇకపోతే, త్వరలోనే వన్డే సిరీస్ ప్రారంభంకానుంది.