Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరికొత్త రికార్డు నెలకొల్పిన కోహ్లీ - రహానే

Webdunia
ఆదివారం, 25 ఆగస్టు 2019 (14:11 IST)
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు తొలి టెస్టు మ్యాచ్ ఆడుతోంది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, బ్యాట్స్‌మెన్ అజింక్యా రహానేలు ఓ సరికొత్త రికార్డు నెలకొల్పారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో తరపున అత్యధిక సెంచరీల భాగస్వామ్యం జోడీగా నిలిచారు.
 
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ - రహానేల జోడి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ తలో హాఫ్‌ సెంచరీ సాధించి అజేయంగా 104 పరుగుల్ని జత చేశారు. ఫలితంగా భారత్‌ తరఫున అత్యధిక సార్లు వంద పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన జోడిగా కొత్త రికార్డు నమోదు చేసింది.
 
ఈ క్రమంలోనే దిగ్గజ ఆటగాళ్లు సౌరవ్‌ గంగూలీ-సచిన్‌ టెండూల్కర్‌ల రికార్డును కోహ్లీ - రహానేలు బ్రేక్‌ చేశారు. నాల్గో వికెట్‌కు గంగూలీ - సచిన్‌లు ఏడుసార్లు సెంచరీ భాగస్వామ్యాల్ని సాధించగా, కోహ్లీ - రహానేలు దాన్ని సవరిస్తూ ఎనిమిదో సారి వంద పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. 
 
భారత్‌ తరఫున టెస్టు ఫార్మాట్‌లో నాలుగో వికెట్‌కు అత్యధికసార్లు వంద పరుగులు భాగస్వామ్యాల్ని సాధించిన జోడీల జాబితాలో తొలి రెండు స్థానాల్లో కోహ్లీ - రహానే, గంగూలీ - సచిన్‌ల జోడి ఉండగా, ఆపై మూడో స్థానంలో మహ్మద్‌ అజహరుద్దీన్ - సచిన్‌ల జోడి(ఆరుసార్లు) ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

ఇద్దరు కొడుకులతో మంగళగిరి నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్

గిరిజనులకు మామిడి పండ్లను బహుమతిగా పంపించిన పవన్ కళ్యాణ్

పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

Husband: మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే నరికేసిన భర్త.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments