''సరిలేరు నీకెవ్వరు'' కాంటెస్ట్.. ఇంత‌కీ ఏంటా కాంటెస్ట్..?

గురువారం, 22 ఆగస్టు 2019 (11:03 IST)
సూపర్ స్టార్ మహేష్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం సరిలేరు నీకెవ్వరు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో మహేష్ నటిస్తుండగా, సీనియర్ నటి విజయశాంతి ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. 
 
ఇకపోతే ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఇంట్రో టీజర్, అలానే స్వతంత్ర దినోత్సవం నాడు భారత సైనికులకు నివాళిగా రిలీజ్ చేసిన సాంగ్ యూట్యూబ్ లో మంచి వీక్షకధారణను సంపాదించాయి.
 
 అయితే నేడు సరిలేరు నీకెవ్వరూ మూవీ టీమ్, సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. 
 
అదేమిటంటే, సూపర్ ఫ్యాన్స్ అందరూ తమకు నచ్చిన విధంగా సరిలేరు నీకెవ్వరు మూవీకి సంబంధించి ఫ్యాన్ మెడ్ ట్రిబ్యూట్ వీడియోస్ మరియు పోస్టర్స్ ని క్రియేట్ చేయాలని, అలా క్రియేట్ చేసి పోస్ట్ చేసిన వాటినుండి, తాము ఎంపిక చేసిన బెస్ట్ వీడియోస్ మరియు పోస్టర్స్ ను, త్వరలో తమ అఫీషియల్ పేజెస్ లో పోస్ట్ చేయడం జరుగుతుందని తెల్పడం జరిగింది. 
 
దీనితో సూపర్ ఫ్యాన్స్ అప్పుడే తమ తమ టాలెంట్ ని చూపించేందుకు పోస్టర్స్, వీడియోస్ ని రెడీ చేసి వాటిని తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. మరి వాటినుండి ఎవరి పోస్టర్స్, వీడియోస్ సెలెక్ట్ అవుతాయో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాలి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం #HBDChiranjeevi ఆ ఇద్ద‌రే స్ఫూర్తి: మ‌న‌సులోని మాట‌ల్ని బ‌య‌ట పెట్టిన పవర్ స్టార్