Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నా.. కానీ ఇప్పుడు తపిస్తున్నా.. అంబటి రాయుడు

Webdunia
శనివారం, 24 ఆగస్టు 2019 (15:29 IST)
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి సంచలనం సృష్టించిన హైదరాబాద్ ఆటగాడు అంబటి రాయుడు.. తన రిటైర్మెంట్‌ను ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నట్టు తెలిపాడు. ప్రస్తుతం రాయుడు టీఎన్‌సీఏ వన్డే లీగ్‌లో గ్రాండ్‌శ్లామ్‌ జట్టుకు ఆడుతున్నాడు. 
 
మ్యాచ్‌ ముగిసిన తర్వాత అంబటి రాయుడు మీడియాతో మాట్లాడుతూ భారత్‌ తరుఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌‌తో పాటు ఐపీఎల్ ఆడాలని భావిస్తున్నట్టు వెల్లడించాడు. దీంతో అంబటి రాయుడు మనసు మార్చుకున్నాడని క్రికెట్ పండితులు అంటున్నారు. 
 
ప్రపంచ కప్ కోసం ఐదేళ్ల పాటు తీవ్రంగా శ్రమించా. అయినా జట్టులో చోటు లభించకపోతే నిరాశ చెందడం సహజం. అప్పుడు అలాంటి నిర్ణయం తీసుకున్నా. ఆ తర్వాత మళ్లీ ఆలోచించా. తిరిగి భారత్‌ తరపున ఆడాలని తపిస్తున్నానని అంబటి వ్యాఖ్యానించాడు. 
 
ఇకపోతే.. గత రెండేళ్లుగా టీమిండియా తరఫున నిలకడగా ఆడిన రాయుడిని ఎమ్మేస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయలేదు. రాయుడి స్థానంలో విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేశారు.
 
దీంతో ప్రపంచకప్‌ను వీక్షించేందుకు ''3డీ'' కళ్లద్దాలు కొనుగోలు చేస్తానని ట్వీట్‌ చేశాడు. ఈ వివాదమే అంబటి రాయుడిని రిటైర్మెంట్ ప్రకటించేలా చేసింది. కానీ ఆపై అంబటి ఆలోచించి నిర్ణయం తీసుకుని క్రికెట్ ఆడాలనే ఆకాంక్షను వెలిబుచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

తర్వాతి కథనం
Show comments