అనిల్ కుంబ్లే పర్ఫెక్ట్ 10కు 20 ఏళ్లు

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (12:57 IST)
అవును పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్లను ఒక్కొక్కరిని పెవిలియన్‌కు సాగనంపుతూ.. 26.3 ఓవర్లతో 74 పరుగులిచ్చి .. పది వికెట్లు పట్టేసిన ఘనత సాధించాడు.. అనిల్ కుంబ్లే. తద్వారా అరుదైన ఘనత భారత్ ఖాతాలో పడిన రోజు.. ఈ రోజే.
 
ఫిబ్రవరి 7, 1999.. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత బౌలింగ్ దిగ్గజం అనిల్ కుంబ్లే టెస్టుల్లో పర్ఫెక్ట్ టెన్ సాధించింది.. ఈ రోజునే. ఈ అద్భుతం జరిగి ఈ రోజుతో 20 సంవత్సరాలు పూర్తయ్యాయి. తన స్పిన్ మాయాజాలంతో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్లను పెవిలియన్‌కు సాగనంపాడు. 
 
10 వికెట్ల ఘనత ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ ఖాతాలోనే వుండేది. ఆయన 1956లో పర్ఫెక్ట్ టెన్ సాధించాడు. అది జరిగిన 43 ఏళ్లకు మన కుంబ్లే మళ్లీ అలాంటి ఫీట్ చేసి.. ఈ రికార్డు సృష్టించిన రెండో బౌలర్‌గా క్రికెట్ చరిత్రలో నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్సులో 252 పరుగుల చేసి ఆలౌట్ అయ్యింది. 420 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్.. మొదట్లో జోరుమీద కనిపించింది. 
 
పాక్ బ్యాట్స్‌మెన్లలో 41 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర అఫ్రీది ఔట్ కావడంతో కుంబ్లే బంతికి పనిచెప్పాడు. కుంబ్లే బౌలింగ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్ ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పట్టారు. 207 పరుగులకు ఆలౌట్ అయ్యారు. కుంబ్లే సూపర్ ఇన్నింగ్సులో మూడు ఎల్బీడబ్ల్యూలు వుండటం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

తర్వాతి కథనం
Show comments