ఎన్టీఆర్ బయోపిక్.. మళ్లీ వాయిదా...

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (19:33 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". ఈ చిత్రం తొలి భాగం 'కథానాయకుడు'. సంక్రాంతికి రిలీజైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
 
ఈ చిత్రం రెండో భాగమైన 'మహానాయకుడు' కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. వాస్తవానికి ఈ చిత్రం ఫిబ్రవరి ఏడో తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ, కారణాలు తెలియవు కానీ వాయిదా వేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 14వ తేదీ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ ఇపుడు మళ్లీ ఈ విడుదల తేదీని వాయిదా వేశారు. ఈ మలి భాగం మహాశివరాత్రి సందర్భంగా విడుదల కానుందట.
 
తాజా సమాచారం ప్రకారం మహాశివరాత్రి కానుకగా రెండో భాగాన్ని విడుదల చేయనున్నారని తెలిసింది. ఫిబ్రవరి 28 లేదా మార్చి 1న కానీ రెండో భాగం రిలీజ్ కావచ్చని సమాచారం. మరి రెండో భాగమైనా కమర్షియల్‌గా మెప్పిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. ఈ చిత్రాన్ని హీరో బాలకృష్ణ తన సొంత బ్యానర్ ఎన్.బి.కె ఫిలిమ్స్ పతాకంపై నిర్మించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Final Supermoon of 2025: 2025లో చివరి పౌర్ణమి డిసెంబర్ 4.. సూపర్ మూన్ ఇదే లాస్ట్

తెలంగాణ రాజ్‌భవన్ పేరు మారిపోయింది...

ఫనీంద్ర రాసలీలలు.. మహిళతో యవ్వారం.. వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి..?

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments