Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌లో క్రికెట్ దిగ్గజానికి చోటు

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (22:21 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ వల్ల అనేక క్రీడా పోటీలు వాయిదాపడుతున్నాయి. అయితే, త్వరలో ఐపీఎల్ పోటీల నిర్వహణకు భారత క్రికెట్​ నియంత్రణ మండలి(బీసీసీఐ) చర్యలు చేపట్టింది. ఇందుకోసం కొవిడ్​-19 టాస్క్​ఫోర్స్​లో క్రికెట్ దిగ్గజం, జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్​సీఏ) చీఫ్ రాహుల్ ద్రవిడ్​కు చోటుదక్కింది. 
 
రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ప్రామాణిక నిర్వహణ విధానాన్ని(ఎస్​వోపీ) సోమవారం ప్రకటించిన బీసీసీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. ఎస్​వోపీ నిబంధనలు పాటిస్తూ ప్రాక్టీస్ చేస్తామని ప్లేయర్లు ఆయా రాష్ట్ర సంఘాల సెంటర్లలో సంతకాలతో కూడిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే బెంగళూరులోని ఎన్​సీఏలో ఆటగాళ్లకు ట్రైనింగ్​ను పునఃప్రారంభించేందుకు అవకాశం ఉంది.
 
కరోనా ప్రమాదం నేపథ్యంలో ట్రైనింగ్​లో ప్లేయర్లు అందరూ ఎస్​వోపీ నిబంధలు పాటించేలా చూసేందుకు బీసీసీఐ కొవిడ్​ టాస్క్​ఫోర్స్ ఏర్పాటుచేసింది. దీనిలో ద్రవిడ్​తో పాటు ఓ మెడికల్ ఆఫీసర్​, బీసీసీఐ ఏజీఎమ్​ కూడా ఉన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆటగాళ్లు నిబంధనలు పాటించేలా ఈ టాస్క్​ఫోర్స్ పర్యవేక్షించనుంది. అలాగే ప్లేయర్లకు వ్యక్తిగతంగా సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు కరోనాపై సమాచారాన్ని అందివ్వనుంది. 
 
అనుసంధానం చేయనుంది. కాగా ఈ నెలలోనే ప్రారంభం కావాల్సిన దేశవాళీ సీజన్ కరోనా కారణంగా వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమవుతుందో కూడా తెలియని పరిస్థితి. ప్లేయర్లు సైతం దాదాపుగా నాలుగు నెలల నుంచి ప్రాక్టీస్​కు దూరంగా ఉన్నారు. అయితే ఎస్​వోపీని పాటిస్తూ రాష్ట్ర సంఘాల కేంద్రాలు, ఎన్​సీఏలో ప్రాక్టీస్ చేసేందుకు బీసీసీఐ తాజాగా అనుమతించింది. దీని కోసం ఎస్​వోపీని పాటిస్తామని ప్లేయర్లు సంతకాలు చేయాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం