Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల ఐపీఎల్.. బీసీసీఐ గ్రీన్ సిగ్నల్.. కరోనా కాలంలో సూపర్ క్రికెట్ టోర్నీ

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (14:14 IST)
మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కరోనా కష్ట కాలంలో ఈ ఏడాది లీగ్‌ జరుగుతుందా లేదా అనే అనుమానాలను బీసీసీఐ పటాపంచలు చేసింది. నవంబరు 1 నుంచి 10 వరకు యూఏఈలోనే నిర్వహించనున్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపారు. చాలెంజర్‌ సిరీస్‌ పేరిట ఈ టోర్నీ జరుగనుంది. 
 
మహిళల టోర్నీలో గతేడాదిలాగే మూడు జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ టోర్నీ కన్నా ముందే సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఉన్న మహిళా క్రికెటర్లకు శిక్షణ శిబిరం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ షెడ్యూల్‌ మధ్యలో చాలెంజర్‌ సిరీస్‌ను జరుపుతాం. అలాగే కరోనా వైరస్ కారణంగా జాతీయ క్రికెట్‌ శిబిరం మూతబడింది కాబట్టి మహిళల ఐపీఎల్‌ కన్నా ముందే వారికి శిబిరం ఏర్పాటు చేస్తామని సౌరవ్ గంగూలీ చెప్పారు. 
 
యూఏఈలో మహిళల ఐపీఎల్‌నూ నిర్వహించాలన్న బీసీసీఐ నిర్ణయం పట్ల భారత మహిళల వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ సంతోషం వ్యక్తం చేశారు. వన్డే ప్రపంచకప్‌ కోసం మా సన్నాహం ఎట్టకేలకు ఆరంభం కానుంది. బీసీసీఐ, సౌరవ్ గంగూలీ, జై షాలకు కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు. సీనియర్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ కూడా బీసీసీఐ బాస్ గంగూలీ, బీసీసీఐలకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments