Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్ నిర్వహణకు సిద్ధం - బంపర్ ఆఫర్ ఇచ్చిన దుబాయ్

ఐపీఎల్ నిర్వహణకు సిద్ధం - బంపర్ ఆఫర్ ఇచ్చిన దుబాయ్
, శుక్రవారం, 17 జులై 2020 (16:48 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుతో పాటు.. ఫ్రాంచైజీలకు కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్వంటీ20 పోటీలు కరోనా మహమ్మారి కారణంగా ఈ యేడాది నిర్వహించలేక పోయారు. నిజానికి గత మార్చి నెలాఖరులో ప్రారంభమై మే నెల 15వ తేదీ నాటికి ఈ పోటీలు ముగియాల్సివుంది. కానీ, కరోనా వైరస్ దెబ్బకు ఈ పోటీలను వాయిదావేశారు. 
 
అదేసమయంలో ప్రస్తుతం భారత్‌లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. శుక్రవారం నాటికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఐపీఎల్ పోటీల నిర్వహణ అసాధ్యంగా మారింది. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు దుబాయ్ స్పోర్ట్స్ సిటీ అధిపతి సల్మాన్ హనీఫ్ ప్రకటించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఒక‌వేళ ఐపీఎల్‌ను దుబాయ్‌లో నిర్వ‌హించాల‌నుకుంటే, తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో అన్ని స‌దుపాయాల‌ను రెడీగా ఉంచిన‌ట్లు ఆయ‌న చెప్పారు. దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియం, ఐసీఎల్  అకాడెమీ స్పోర్ట్స్ సిటీలోనే ఉన్నాయి. 
 
అక్టోబరు 18 నుంచి న‌వంబ‌రు 15 వ‌ర‌కు ఆస్ట్రేలియాలో టీ20 వ‌రల్డ్‌క‌ప్ జ‌ర‌గాల్సి ఉంది. దానిపై వ‌చ్చే వారం క్లారిటీ రానుంది. ఒక‌వేళ ఆ వ‌ర‌ల్డ్ క‌ప్ ర‌ద్దు అయితే, అప్పుడు ఐపీఎల్ ఎడిష‌న్‌ను సెప్టెంబ‌రు లేదా అక్టోబ‌రులో దుబాయ్‌లో నిర్వ‌హిస్తార‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 
 
ఇపుడు ఐపీఎల్ నిర్వహణపై హనీఫ్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. త‌మ స్టేడియంలో తొమ్మిది పిచ్‌లు ఉన్నాయని, ఒక‌వేళ త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ మ్యాచ్‌లు నిర్వ‌హించినా ఎటువంటి న‌ష్టం ఉండ‌ద‌ని హ‌నీఫ్ తెలిపారు. పిచ్ కోసం మ్యాచ్‌ల‌ను షెడ్యూల్ చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని చెప్పుకొచ్చారు. కాగా, యూఏఈలో ఇప్ప‌టి వ‌ర‌కు 50 వేల మందికి వైర‌స్ సంక్ర‌మించింది. 300 మంది మ‌ర‌ణించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బర్త్‌డే రోజున ప్రియుడికి తేరుకోలేని షాకిచ్చిన గుత్తా జ్వాలా