Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంజీల్లోకి రానున్న శ్రీశాంత్.. కేరళ క్రికెట్ బోర్డు గ్రీన్ సిగ్నల్

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (17:38 IST)
టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ మళ్లీ రంజీల్లోకి అడుగుపెట్టనున్నాడు. ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్‌కు దూరమైన శ్రీశాంత్.. రంజీల్లో ఆడుతాడు. ఇందుకు కేరళ క్రికెట్ బోర్డు(కేసీఏ) కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది సెప్టెంబరుతో శ్రీశాంత్‌పై ఉన్న నిషేధ కాలం ముగియనుండడంతో అతడిని రంజీల్లోకి తీసుకోనున్నట్లు కేరళ క్రికెట్ బోర్డు తెలిపింది.
 
కేరళ బోర్డు ప్రధాన కోచ్ టినూ యోహానన్ దీనిపై స్పందిస్తూ, శ్రీశాంత్‌ను తిరిగి రంజీల్లోకి తీసుకునే అవకాశం ఉందని, అయితే అతడు తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
 
కాగా, 2013 ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకుగానూ శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించారు. అతడితోపాటు రాజస్థాన్ రాయల్స్‌కే చెందిన అంకిత్ చవాన్, అజిత్ చండీలాలు కూడా క్రికెట్‌కు జీవితకాలం దూరమయ్యారు. 
 
అయితే దీనిపై కోర్టుకెక్కిన శ్రీశాంత్ రెండేళ్ల పాటు పోరాడి ఎలాగోలా జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించుకున్నాడు. ఈ నేపథ్యంలో సెప్టెంబరుతో అతడి నిషేధ గడువు పూర్తి కానుంది. ఇలాంటి తరుణంలో రంజీల్లో అతడి ప్రవేశం వుంటుందని క్రీడా పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments