Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏనుగును అనాసపండుతో చంపినవారిని పట్టుకోండి: కేరళ ప్రభుత్వం

Advertiesment
ఏనుగును అనాసపండుతో చంపినవారిని పట్టుకోండి: కేరళ ప్రభుత్వం
, శుక్రవారం, 5 జూన్ 2020 (11:31 IST)
కేరళలో అనాసపండ్లలో ప్రేలుడు పదార్థములు పెట్టి ఏనుగు చావుకు కారకులైన వారిని పట్టుకోవాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. ఆహార పదార్థాములలో ప్రేలుడు పదార్థములను దాచి మూగజీవులను హింసకు గురిచేయడం భారత సంప్రదాయానికి విరుద్ధమని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. ఈ అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. 
 
కాగా అనాసపండులో ప్రేలుడు పదార్థాలతో తిన్న ఏనుగు నోటి భాగము పేలి తీవ్రమైన గాయలకు గురైంది. ఆకలి బాధ ఒకవైపు గాయాలు మరోవైపు బాధిస్తూ వుండటంతో ఓ రోజంతా తిరిగి తిరిగి ప్రక్కనే వున్న ఏరులోనికి వెళ్లి అక్కడే నిలబడిపోయింది. చివరకు గర్భవతి అయిన ఏనుగు అక్కడే నీటిలోనే పడి చనిపోయింది.
 
సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఏనుగు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియలు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారణానికి పాల్పడినవారిని వెంటనే అరెస్టు చేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్రకృతి మాతను కాపాడుదాం..