ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో తమ రాష్ట్ర ప్రజల కోసం కర్నాటక ప్రభుత్వం కొన్ని నియమాలు సూచించింది. ఇతర రాష్ట్రాల నుండి తమ రాష్ట్రానికి వలస రావడం వల్ల రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నదని తెలిపింది.
కరోనా కేసులో ఎక్కువగా వున్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారిని కర్నాటకకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. ఈ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లు, విమానాల రాకపోకలను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి కొన్ని రోజులు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని తెలిపింది.