Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ నాలుగు రాష్ట్రాల ప్రజల ప్రవేశంపై కర్నాటక నిషేధం

ఆ నాలుగు రాష్ట్రాల ప్రజల ప్రవేశంపై కర్నాటక నిషేధం
, సోమవారం, 18 మే 2020 (15:25 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో నాలుగో దశ లాక్డౌన్ సోమవారం నుంచి ఈ నెల 31వ తేదీ రాత్రి వరకు కొనసాగనుంది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు సడలిస్తుంటే, మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం వీటిని మరింత కఠినతరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
దేశంలో కరోనా కేసులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రజలు తమ రాష్ట్రంలో అడుగుపెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ప్రకటించారు. 
 
పైన పేర్కొన్న నాలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పక్క రాష్ట్రాలతో అవగాహనతో ప్రజలను, వాహనాలను అనుమతించవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే.
 
నిజానికి దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ, ఈ నాలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ నాలుగు రాష్ట్రాల ప్రజల రాకపోకలపై పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇందులోభాగంగానే ఇపుడు కర్నాటక ప్రభుత్వం కూడా ఆంక్షలు విధించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామ్‌లీలా మైదానంలో వేలాది మంది కార్మికులు.. కరోనా సంగతేంటో?